BigTV English

Anantapuram: అనంతపురంలో శ్రీరామాలయం రథానికి నిప్పు.. స్పందించిన సీఎం

Anantapuram: అనంతపురంలో శ్రీరామాలయం రథానికి నిప్పు.. స్పందించిన సీఎం

Atrocity in Anantapuram Chariot of Sriramalayam Set on Fire: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే తిరుమల లడ్డూ కల్తీ వివాదం నడుస్తున్న నేపథ్యంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాళ్‌ గ్రామంలో శ్రీరామాలయం రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను అదుపు చేశారు. అప్పటికే రథం సగం కాలిపోయింది. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రథం కాలిపోవడంపై అధికారులతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. రథానికి నిప్పుపెట్టడాన్ని సీఎం చంద్రబాబు ఖండించారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. దర్యాప్తుకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తనకు తెలపాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.

Also Read:  బుడమేరు ఆపరేషన్.. 270 ఎకరాల్లో ఆక్రమణలు


ఈ ఘటనలో రథం సగంపైగా కాలిపోయింది. అయితే సంఘటనా స్థలం వద్ద బీజేపీ , బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రథానికి ఎవరు నిప్పు పెట్టారో వెంటనే తెలుసుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. తమ సెంటిమెంట్లను దెబ్బతీయడానికి కొందరు కావాలనే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని పలువురు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×