BigTV English

Chiranjeevi : చిరు సీక్రెట్ ఫామ్ హౌస్… ఎక్కడుంది? ధర ఎంతో తెలుసా?

Chiranjeevi : చిరు సీక్రెట్ ఫామ్ హౌస్… ఎక్కడుంది? ధర ఎంతో తెలుసా?

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాలుగా తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాగే తన టాలెంట్ ను క్యాష్ చేసుకుని, స్టార్ డంకు తగ్గట్టుగా ఆస్తులను కూడా సంపాదించుకున్నారు. మెగాస్టార్ జీవితం తెరిచిన పుస్తకమే అయినప్పటికీ ఆయన గురించి అభిమానులకు తెలియని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి చిరంజీవి విలాసవంతమైన ఆస్తులలో ఒకటైన విశాలమైన ఫామ్ హౌస్. మరి ఇది ఎక్కడుంది? దీని విలువ ఎంత అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


చిరు ఫామ్ హౌస్.. ఏ పండగ వచ్చినా అక్కడే  

తన అద్భుతమైన డ్యాన్స్ స్కిల్స్ తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో తాజాగా చోటు దక్కించుకున్న చిరుకు సోషల్ మీడియాలో ఇంకా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన గురించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒకటి చిరు ఫామ్ హౌస్, దాని ధర. మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ లో ఇంద్ర భవనం లాంటి ఇల్లు ఉందన్న విషయం తెలిసిందే. ఆ ఇంటి ధర రూ. 300 కోట్లు. అయితే అదే కాకుండా ఆయన దగ్గర ఇంకా పలు ఫామ్ హౌస్ లు, లగ్జరీ కార్లు, ఆస్తులు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక ఫామ్ హౌస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.  బెంగుళూరు నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవనహళ్లిలో విశాలమైన, విలాసవంతమైన ఫామ్‌ హౌస్‌ ఉంది చిరంజీవికి. ఈ విషయం అతికొద్ది మందికే తెలుసు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇది కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా చాలా దగ్గరలో ఉంది. అంటే ఖచ్చితంగా దాని విలువ కోట్లలోనే ఉంటుందన్న మాట. సమాచారం ప్రకారం చిరుకు బెంగుళూరు దగ్గరలో ఉన్న ఆ ఫామ్ హౌస్ విలువ సుమారు రూ. 30 కోట్లు. కాగా మెగాస్టార్ తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపడానికి తరచుగా ఈ బంగ్లాకు వస్తుంటారు. ఈ బంగ్లాలో ప్రతి సంవత్సరం జనవరిలో జరిగే సంక్రాంతి పండుగతో సహా అనేక పండుగలు జరుపుకుంటారు. అలాగే ఇక్కడ జరిగే ఫ్యామిలీ ఈవెంట్స్ లో చిరంజీవి కూడా పాల్గొంటారు.


Chiranjeevi calls out son Ram Charan for going to Bangkok without switching  off lights: 'My family habitually wastes electricity'

చిరు కార్ కలెక్షన్ 

మెగాస్టార్ దగ్గర మెగా కార్ కలెక్షన్ కూడా ఉంది. ఆయన గ్యారేజీలో90 లక్షల టయోటా ల్యాండ్ క్రూయిజర్,  రూ. 10 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్, 1 కోటి విలువైన రే రోవర్ ఆటో ఫైవ్, రేంజ్ రోవర్ వోగ్, కోటి విలువైన మరో కారు ఉన్నాయి. ఇదిలా ఉండగా 45 సంవత్సరాలుగా 156 చిత్రాలలో 537 పాటలలో 24,000 డ్యాన్స్ స్టెప్పు లేసి చిరంజీవి సాధించిన మెగా అచీవ్‌మెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం 2025 జనవరి 10న థియేటర్లలోకి రానుంది. ఈ ప్రాజెక్టులో త్రిష కృష్ణన్, కునాల్ కపూర్, మీనాక్షి చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×