BigTV English

Rohit Sharma Crying Video: అయ్యో రోహిత్.. అలా చూస్తే బాధేస్తుంది..

Rohit Sharma Crying Video: అయ్యో రోహిత్.. అలా చూస్తే బాధేస్తుంది..

Rohit Sharma Crying Video during MI vs SRH Match in IPL 2024: IPL 2024 సీజన్ లో భాగంగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌తో జరిగన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిచినప్పటికీ, రోహిత్ శర్మ పేలవమైన స్కోర్ల సిరీస్ సోమవారం కూడా కొనసాగింది. ఈ సీజన్‌లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు.


అంతుకుముందు చెన్నైతో జరిగిన మ్యాచ్ మినహా అతని ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. కేవలం చెన్నై మీద 61 బంతుల్లో సెంచరీ చేశాడు. అయిన ఆ మ్యాచ్‌లో ముంబై పరాభావాన్ని అడ్డుకోలేకపోయాడు. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ముంబై 20 పరుగుల తేడాతో పరాభవాన్ని మూటగట్టుకుంది.

రోహిత్ శర్మ పేలవ ప్రదర్శనతో పాటు ఈ సీజన్‌లో ముంబై జట్టు అస్థిరమైన ప్రదర్శన చేసింది. 12 మ్యాచులు ఆడిన ముంబై ఇప్పటివరుకు 4 విజయాలు మాత్రమే సాధించి 8 మ్యాచుల్లో పరాజయంపాలయ్యింది. సోమవారం జరిగిన మ్యాచ్‌తో సహా చివరి 5 మ్యాచుల్లో రోహిత్ శర్మ స్కోర్లు 4, 11, 4, 8, 6 . చివరి ఐదు మ్యాచుల్లో అతను కేవలం 33 పరుగులు చేశాడు.


జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2024లో భారత క్రికెట్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మ పేలవ ఫామ్ టీమిండియా మేనేజ్‌మెంట్‌కు తలనొప్పి పెంచుతుంది. ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే సైతం రోహిత్ శర్మ ఫామ్ గురించి జట్టును కలవరపెడుతోందని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. “రోహిత్ శర్మ ఫామ్ ఇప్పుడు కొంచెం ఆందోళన కలిగిస్తుంది. అతని మొదటి 7 ఇన్నింగ్స్‌లలో 297, అతని తదుపరి 5 ఇన్నింగ్స్‌లో కేవలం 33 పరుగులు మాత్రమే” అని అతను పోస్ట్ చేశాడు.

Also Read: కెప్టెన్ రోహిత్ ఏమైంది?.. టీ 20 వరల్డ్ కప్ కి సిద్ధమేనా?

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తక్కువ స్కోర్‌కే వెనుదిరిగిన తర్వాత రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా నిరుత్సాహంగా కనిపించాడు. అతని నిరుత్సాహానికి సంబంధించిన విజువల్స్ వైరల్ అయ్యాయి. కేవలం 4 పరుగులకు అవుట్ అవ్వడంతో రోహిత్ కంటతడి పెట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో ఫామ్ టెంపరరీ.. క్లాస్ పర్మినెంట్ అని నెటిజన్స్ రోహిత్ కు మద్దుతు పలుకుతున్నారు. మరికొందరు ఇలా అయితే టీమిండియా టీ20 ప్రపంచ కప్ గెలిచినట్లే అని వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు.

ఏదేమైనా రోహిత్ శర్మ ఫామ్ అందుకోవడం టీమిండియాకు చాలా అవసరం. హిట్‌మ్యాన్ తన మునుపటి ఫామ్ అందుకుంటే టీమిండియాకు పొట్టి కప్ దక్కినట్లే అని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×