BigTV English

Pawan Kalyan: వావ్.. అద్భుతమైన సందేశం.. పవన్ కల్యాణ్ కామెంట్స్

Pawan Kalyan: వావ్.. అద్భుతమైన సందేశం.. పవన్ కల్యాణ్ కామెంట్స్

Pawan Kalyan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ సోమవారం రాత్రి మాట్లాడారు. ఉగ్రవాదంపై తమ వైఖరి స్పష్టంచేశారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పై ఉగ్ర దాడులకు పాల్పడితే ఊహించని విధంగా సమాధానం ఇస్తామని చెప్పకనే చెప్పారు. ఇదే క్రమంలో ప్రధాని చెప్పిన కొన్ని పాయింట్లను నొక్కి ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.


ప్రధాని సందేశం.. వావ్

ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడిన మాటలను ప్రస్తావించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ‘భారత్‌, అంతర్జాతీయ సమాజానికి ఎంత శక్తివంతమైన సందేశం ఇచ్చారని అన్నారు. ఉగ్రవాదం-చర్చలు, ఉగ్రవాదం-వాణిజ్య కలిసి సాగవన్నారు. అలాగే రక్తం-నీరు కలిసి ప్రవహించవని రాసుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేశారని పేర్కొన్నారు. మోదీ జీ, భారత్ మాతాకీ జై’ అంటూ ముగించారు.


పహల్‌‌గామ్ ఉగ్ర దాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్‌పై భారత్ వెంటనే చర్యలు చేపట్టింది. ఆ దేశం చుట్టూ ఉచ్చు బిగుసుకునేలా మెల్లగా ఆంక్షలు విధించింది. చివరకు భారత్‌లో ఉన్న పాకిస్తానీయులు వెంటనే దేశం విడిచిపోవాలని మోదీ సర్కార్ ఆదేశించింది. అంతకుముందే పాక్‌ భూబాగంలోని ఉగ్రవాదులపై దాడులు జరిగితే మంచి ఫలితాలు వచ్చేవని అంటున్నారు అతివాదులు.

అప్పటివరకు వారం ముందు నుంచి తమపై దాడికి భారత్ ప్లాన్ చేస్తుందని, స్పష్టమైన సమాచారం తమకు ఉందని పాక్ పాలకులు పదేపదే చెబుతూ వచ్చారు. అదే సమయంలో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రస్థావరాల్లో కీలక నేతలు దాడులకు ముందు తప్పుకున్నారని అంటున్నారు. అప్పుడే భారత్ ఆ దేశంపై చర్యలకు దిగితే మంచి ఫలితాలు వచ్చేవని అంటున్నారు.

ALSO READ: యువతకు టీటీడీ స్పెషల్ ఆఫర్, ఉచితంగా వీఐపీ బ్రేక్ దర్శనం

ప్రధాని ప్రసంగం వెనుక

కేవలం మూడు రోజుల్లో పాక్‌ని చిత్తు చేసిన భారత సైన్యం, ఒక్కరోజు సమయం కేటాయిస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్ సొంతం అయ్యేదని అంటున్నారు. ఉగ్రవాదుల బెడద కూడా తప్పేదని అంటున్నారు.  ఉగ్రవాదులు పీఓకె నుంచి తమ ఆపరేషన్ చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు.

అతివాదుల నుంచి వస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో పీఓకె విషయంలో మాత్రమే దాయాది దేశంతో చర్చలు ఉంటాయని ప్రధాని మోదీ  సందేశం ఇచ్చారని అంటున్నారు. గతంలో పుల్వామా ఘటన తర్వాత ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసి నేలమట్టం చేశామని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అదే విధంగా చేశామన్నది కొందరు మాట.

భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణపై కొంతమంది అతివాదులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చివరకు ప్రభుత్వాన్ని ఏమీ అనలేక విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీని సైతం ట్రోల్స్ చేశారు కూడా. కాల్పుల విరమణ తర్వాత జరిగిన, జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని ఈ విధంగా మాట్లాడారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Related News

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

AP Rain Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువే!

AP new bar policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. ఇకపై మందుబాబులకు అక్కడ కూడా కిక్కే!

AP Cabinet: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్.. ఒకటి కాదు సుమా.. అవేమిటంటే?

Big Stories

×