Balakrishna:నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కాస్త ఇప్పుడు పద్మభూషణ్ బాలకృష్ణగా మారిపోయిన విషయం తెలిసిందే..50 సంవత్సరాల సినీ ఇండస్ట్రీలో నిర్విరామసేవకు గానూ..ఆయన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఇటీవల పద్మ భూషణ్ తో సత్కరించింది. ఒకవైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయం.. ఇంకొక వైపు హోస్ట్ ఇలా ఏడుపదుల వయసులో కూడా అత్యంత బిజీగా మారిన ఏకైక హీరో బాలకృష్ణ అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా బాలకృష్ణకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేంటంటే ఈయన ఒక దర్శకుడికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. అందులోనూ ఒక హీరోయిన్ విషయంలో.. మరి అసలు ఆ హీరోయిన్ ఎవరు? ఏం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
సినిమా బాధ్యతను మేకర్స్ కే వదిలేస్తున్న బాలయ్య..
సాధారణంగా ఒక సినిమా ప్రారంభం అవుతోంది అంటే ఇండస్ట్రీలో ఉండే చాలామంది స్టార్ హీరోలు తమ సినిమా కథ విషయంలోనే కాదు నటీనటులు ఎంపిక విషయంలో కూడా వేలు పెడుతూ ఉంటారు. ఇక తమ సినిమాలో హీరోయిన్ ని తామే ఎంచుకుంటాము అని కూడా దర్శక నిర్మాతలకు కండిషన్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కొంతమంది మాత్రం పూర్తిగా ఆ బాధ్యతలను మేకర్స్ పైనే వదిలేస్తూ ఉంటారు. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈయన గురించి ఎంత మాట్లాడినా తక్కువే.. అద్భుతమైన నటనతో.. వాక్చాతుర్యంతో.. అల్లరితనంతో అన్ని కలగలిసిన నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. తన సినిమాల విషయంలో ఎప్పుడూ కూడా మేకర్స్ ను ఇబ్బంది పెట్టరు. పూర్తి బాధ్యతలను మేకర్స్ కే వదిలేస్తారు. ముఖ్యంగా వాళ్ళ బడ్జెట్ కి తగ్గట్టుగా ఏ హీరోయిన్ అయినా తనకు ప్రాబ్లం లేదు అనుకునే వ్యక్తిత్వం బాలయ్యది.
ఆ హీరోయిన్ విషయంలో డైరెక్టర్ కి స్ట్రాంగ్ వార్నింగ్..
అయితే ఒక సినిమా విషయంలో మాత్రం బాలయ్య నా సినిమాలో ఆ హీరోయిన్ వద్దు అంటూ తెగేసి చెప్పారట. ఆమె ఎవరో కాదు పూజా హెగ్డే (Pooja Hegde)ఆ సినిమా ఏదో కాదు ‘వీరసింహారెడ్డి’. ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. శృతిహాసన్(Shruti Haasan) హీరోయిన్గా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇందులో హనీ రోజ్ (Honey Rose) మరో హీరోయిన్గా కనిపించి, ఆకట్టుకుంది. అయితే శృతిహాసన్ పాత్ర కోసం ముందుగా పూజా హెగ్డేని అనుకున్నారట డైరెక్టర్. కానీ పూజా హెగ్డే అప్పటికే బాలయ్యతో రెండు సినిమాలు రిజెక్ట్ చేసిందట. ఆ కారణంగానే ఆ హీరోయిన్ ని ఇకపై తన సినిమాలలో తీసుకోవద్దని డైరెక్టర్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారట బాలయ్య. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ పూజా హెగ్డే కి మాత్రం బాలయ్య తన సినిమాలో అవకాశాన్ని కల్పించలేదు. ఇక అసలు విషయాన్ని అర్థం చేసుకున్న గోపీచంద్ కూడా తన లక్కీ హీరోయిన్ అయిన శృతిహాసన్ ను ఇందులో హీరోయిన్గా పెట్టి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఒక మొత్తానికి అయితే బాలయ్యను పూజా హెగ్డే హార్ట్ చేసింది కాబట్టే బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయిందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:HBD Sunny Leone : సన్నీ లియోన్ ఆస్తి ఎన్ని వందల కోట్లో తెలుసా..? ఈ సంపాదన మొత్తం అక్కడి నుంచేనా..?