E-Paper
Advertisement

Pawan In Mumbai: ముంబైలో డిప్యూటీ సీఎం పవన్.. ఆపరేషన్‌కు మళ్లీ వస్తా, ఈసారి సమస్య అదే

Pawan In Mumbai: ముంబైలో డిప్యూటీ సీఎం పవన్.. ఆపరేషన్‌కు మళ్లీ వస్తా, ఈసారి సమస్య అదే
Advertisement

Pawan kalyan In Mumbai: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌‌కల్యాణ్‌కు ఈ ఏడాది అస్సలు కలిసిరావడం లేదు. ఏదో విధంగా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. మొన్నటికి మొన్న ముక్కు ఆపరేషన్ చేయించుకుని రిలీఫ్ వస్తున్న సమయంలో ఇప్పుడు భుజం సమస్య వెంటాడుతోంది. ఈ క్రమంలో సోమవారం ముంబై వెళ్లారు పవన్ కల్యాణ్ దంపతులు. ఆపరేషన్ పడుతుందని వైద్యులు చెప్పడంతో మళ్లీ వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది.

భుజం నొప్పితో ముంబైలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 

Advertisement

2026 ఏడాది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్సలు కలిసిరావడం లేదు. ఏదో విధంగా అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్నారు. ఏప్రిల్ మూడో వారంలో ముక్కు సమస్యతో బాధపడిన ఆయన, పరీక్షల తర్వాత హైదరాబాద్‌లో ఆపరేషన్ చేయించుకున్నారు. కొద్ది రోజులపాటు రెస్టు తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్న సమయంలో తాజాగా ఇప్పుడు భుజం నొప్పి సమస్య వెంటాడడం మొదలుపెట్టింది.

ఈ నేపథ్యంలో సోమవారం భార్య అన్నా లెజినోవాతో కలిసి ముంబై వెళ్లారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో పరీక్షలు చేశారు. రెండు భుజాలను క్షుణ్ణంగా పరీక్షించిన వైద్యుల టీమ్, రొటేటర్ కఫ్‌తో‌పాటు చేతికి సంబంధించిన రెండు కండరాలకు తీవ్ర గాయమైనట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆపరేషన్ చేయాలని చెప్పినట్టు సమాచారం.

Advertisement

ఆపరేషన్ అవసరమన్న డాక్టర్లు.. మళ్లీ వస్తానని చెప్పినట్ట సమాచారం

ట్రీట్‌మెంట్‌కు సంబంధించి పూర్తి నివేదికను వైద్యుల టీమ్ పవన్ కల్యాణ్‌కు అందజేసినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ పాలనకు సంబంధించి అధికారిక కార్యక్రమాలు, పరిపాలనా విధులు పూర్తి కాగానే ఆపరేషన్ వస్తానని చెప్పినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పవన్ కల్యాణ్ ఆనారోగ్యం గురించి తెలియగానే కాస్త అభిమానులు, కార్యకర్తలు వేగంగా కోలుకోవాలంటూ పూజల్లో నిమగ్నమయ్యారు.   అంతకుముందు నటుడు చిరంజీవి కూడా ముంబైలో భుజానికి ఆపరేషన్ చేయించుకున్న విషయం తెల్సిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో చిరంజీవి ముంబై వెళ్లిన విషయం తెల్సిందే.

ALSO READ: కాపులను జనసేనకు దూరం చేయడమే వైసీపీ ప్లాన్ – ఎమ్మెల్సీ హరిప్రసాద్

Related News

వ్యక్తిగత దూషణలు చేయవద్దు.. జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్!

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ‘వంపు’పై ట్రోల్స్.. గట్టి కౌంటర్ ఇచ్చిన ఏపీ సర్కార్!

వైఎస్సార్‌సీపీ నేత సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజూరు

జగన్ ఎక్కడికి వెళ్లినా అదే రచ్చ.. కర్నూలు జైలులో ఏం జరిగింది? నిజాలు బయటపెట్టిన జైలు అధికారి

అంతర్జాతీయ నగరం.. అమరావతిపై న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం! ఆపై సీఎం చంద్రబాబు..

ఆధారాలు పట్టుకుని రండి.. డీఎస్సీపై చర్చకు మేము సిద్ధం.. వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్!

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. రాజమండ్రి కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు!

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్.. స్టీల్ బ్రిడ్జ్ వద్ద ఆ ‘వంపు’ ఎందుకు?

Big Stories

Advertisement
×