E-Paper
Advertisement

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ‘వంపు’పై ట్రోల్స్.. గట్టి కౌంటర్ ఇచ్చిన ఏపీ సర్కార్!

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ‘వంపు’పై ట్రోల్స్.. గట్టి కౌంటర్ ఇచ్చిన ఏపీ సర్కార్!
Advertisement

Amaravati Seed Access Road: ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డును సీఎం చంద్రబాబు గురువారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బకింగ్ హామ్ కెనాల్ పై నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ ను ఓపెన్ చేసి.. శీలాఫలకాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ బ్రిడ్జ్ గుండా వెళ్లే రోడ్డులో ‘S’ ఆకారపు వంపు ఉండటంతో ఒక్కసారిగా విమర్శలు మెుదలయ్యాయి. రోడ్డును నేరుగా వేసే అవకాశం ఉన్నా.. ఎందుకిలా మెలిక తిప్పుతూ వేశారని వైసీపీ సోషల్ మీడియాతో పాటు నెటిజన్లు ప్రశ్నించారు. నేరుగా వేస్తే.. అక్కడ ఉన్న టీడీపీ నేతల ఆస్తులు పోతాయని ఇలా చేశారా అంటూ రకరకాల కామెంట్స్ పెట్టారు. దీంతో ఆ విమర్శలను ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఖండించింది.

సీడ్ యాక్సెస్ రహదారిలోని ‘S’ ఆకారపు మలుపులపై ప్రజల్లో అపోహలను కలిగించేందుకు కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని సీఆర్డీఏ మండిపడింది. ప్రస్తుతం వంపుతో కనిపిస్తున్న మార్గం.. భవిష్యత్తులో చేపట్టనున్నన్న కీలక రహదారుల అనుసంధానాలకు అనుగుణంగా రూపొందిందని స్పష్టం చేసింది. ‘సీడ్ యాక్సెస్ రహదారి అభివృద్ధి కార్యాచరణను ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా చేపట్టడం జరిగింది. ఫేజ్-3లో విజయవాడ – చెన్నై జాతీయ రహదారిని మణిపాల్ హాస్పిటల్ సమీపంలో అనుసంధానించే ప్రధాన రహదారి నిర్మాణానికి అనుగుణంగానే ప్రస్తుత రహదారి రూపకల్పన చేయబడింది’ అని పేర్కొంది.

Advertisement

Also Read: ఒకేసారి స్వాతంత్రం వస్తే.. పాక్‌లో ఆగస్టు 14నే వేడుకలు ఎందుకు? 1947లో ఏం జరిగింది?

Advertisement

రాజధాని అమరావతికి మంగళగిరి, విజయవాడ ప్రాంతాలతో మెరుగైన రహదారి అనుసంధానం కల్పించడంతో పాటు.. కరకట్టపై వాహనాల రద్దీని తగ్గించడం ప్రధాన ఉద్దేశ్యంగా సీడ్ యాక్సెస్ రహదారిని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సీఆర్డీఏ స్పష్టం చేసింది. అందువల్ల సీడ్ యాక్సెస్ రహదారిలోని ‘S’ ఆకారపు మలుపులను భవిష్యత్ రహదారి కారిడార్ నిర్మాణం, అనుసంధాన అవసరాలు, సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికలో భాగంగా చూడాలని తెలియజేసింది. వీటిపై వస్తున్న అసత్య ప్రచారాలు, అపోహల ఎవరూ నమ్మవద్దని హితవు పలికింది.

Also Read: ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ప్రతి భారతీయుడూ.. తప్పక చూడాల్సిన 10 సరిహద్దు ప్రాంతాలు!

Tags

Related News

కత్తితో యువకుడి ప్రైవేటు పార్ట్స్ కట్ చేసి.. ఆ తర్వాత ఏం చేశారంటే, నరసారావుపేటలో ఘోరం

ఏపీలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం జోష్.. రాష్ట్ర అభివృద్ధికి రూ.11,085 కోట్ల ప్యాకేజీ!

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మళ్లీ ఘోర ప్రమాదం.. నిర్లక్ష్యమే కారణమా?

ఏకగ్రీవాల కోసం కూటమి సర్కార్ భారీ కుట్ర.. మాజీ మంత్రి బుగ్గన సంచలనం!

రన్నింగ్ కారులో మంటలు.. ఓ వ్యక్తి సజీవ దహనం!

తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్ కూలి ముగ్గురి మృతి!

కమల్ హాసన్ కూడా వేస్ట్.. కొల్లు రవీంద్ర నటనపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు!

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనం ధ్వంసం, తాడిపత్రిలో టెన్షన్

Big Stories

Advertisement
×