E-Paper
Advertisement

కాపులను జనసేనకు దూరం చేయడమే వైసీపీ ప్లాన్ – ఎమ్మెల్సీ హరిప్రసాద్

కాపులను జనసేనకు దూరం చేయడమే వైసీపీ ప్లాన్ – ఎమ్మెల్సీ హరిప్రసాద్
Advertisement

Pidugu Hariprasad: మచిలీపట్నంలో జరిగిన జనసేన పార్టీ అంతర్గత సమావేశంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ వైసీపీ పార్టీ వ్యూహాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన పార్టీని, ముఖ్యంగా కాపు సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ ఆడుతున్న రాజకీయ క్రీడను ఆయన ఎండగట్టారు. మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన పార్టీ పదవీ బాధ్యతల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం వెనుక కుట్ర

Advertisement

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కావాలనే వివాదాల్లోకి లాగుతున్నారని పిడుగు హరిప్రసాద్ మండిపడ్డారు. రాష్ట్రంలో జనసేనకు పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక, సంబంధం లేని విషయాలను కూడా పవన్ కళ్యాణ్‌కు అంటగట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో జనసేనను సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని, ఇలాంటి కుట్రలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Also Read: అమరావతిలో ప్రతిష్టాత్మక సీఐఐ గ్లోబల్ సెంటర్.. సీఎం సమీక్షలో కీలక నిర్ణయాలు ఇవే!

Advertisement

కాపులను దూరం చేయడమే వైసీపీ స్ట్రాటజీ

జనసేన పార్టీ నుంచి కాపు సామాజికవర్గాన్ని దూరం చేయడమే వైసీపీ ప్రధాన వ్యూహమని హరిప్రసాద్ ఆరోపించారు. 2024 ఎన్నికల్లో కాపులంతా ఏకతాటిపైకి వచ్చి జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. దీన్ని జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ నాయకులు.. కాపులను పార్టీకి దూరం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. అయితే, రాష్ట్రంలో ఉన్న కాపులంతా అమాయకులేం కాదని, వైసీపీ వేస్తున్న ప్రతి పన్నాగం ఇప్పటికే పూర్తిగా విఫలమైందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

జులై 5 లోగా దరఖాస్తుల స్వీకరణ

పార్టీ బలోపేతంలో భాగంగా వివిధ విభాగాల్లో పదవులు ఆశించే నాయకుల నుంచి హరిప్రసాద్ స్వయంగా దరఖాస్తులను స్వీకరించారు. కేవలం సమర్థత, నిబద్ధత గల నాయకులను మాత్రమే పార్టీ పదవులకు ఎంపిక చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పదవులు ఆశించే వారంతా జులై 5వ తేదీ లోపు తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు. వైసీపీ నాయకులు రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ విభేదాలను సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.

Related News

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ‘వంపు’పై ట్రోల్స్.. గట్టి కౌంటర్ ఇచ్చిన ఏపీ సర్కార్!

వైఎస్సార్‌సీపీ నేత సీదిరి అప్పలరాజుకు బెయిల్ మంజూరు

జగన్ ఎక్కడికి వెళ్లినా అదే రచ్చ.. కర్నూలు జైలులో ఏం జరిగింది? నిజాలు బయటపెట్టిన జైలు అధికారి

అంతర్జాతీయ నగరం.. అమరావతిపై న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం! ఆపై సీఎం చంద్రబాబు..

ఆధారాలు పట్టుకుని రండి.. డీఎస్సీపై చర్చకు మేము సిద్ధం.. వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్!

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. రాజమండ్రి కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు!

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్.. స్టీల్ బ్రిడ్జ్ వద్ద ఆ ‘వంపు’ ఎందుకు?

అమరావతిని ఆపడం ఎవరితరం కాదు.. గ్రేట్ విజన్‌కు మొదటి సక్సెస్ మాత్రమే-సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×