BigTV English

Prajwal Revanna Obscene Video Case: ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ట్విస్ట్.. బలవంతంగా కేసు పెట్టించారన్న మహిళ?

Prajwal Revanna Obscene Video Case: ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ట్విస్ట్.. బలవంతంగా కేసు పెట్టించారన్న మహిళ?

Big Twist in Prajwal Revanna Obscene Video Case: కర్ణాటక జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ప్రజ్వల్ రేవణ్ణపై ఫిర్యాదు చేసిన మహిళల్లో ఒకరు.. తనను కొందరు వ్యక్తులు బలవంతంగా ఫిర్యాదు చేయమని చెప్పారని చెప్పినట్లు జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. వారి బెదిరింపుల కారణంగానే తాను పోలీసులకు ప్రజ్వల్ రేవణ్ణపై తప్పుడు ఫిర్యాదు చేసినట్లు సదరు మహిళ తెలిపిందని NCW వెల్లడించింది.


దీనిపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర ప్రెసిడెంట్ హెచ్ డీ కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేయకపోతే.. వారిపై వ్యభిచారం కేసులు పెడతామని సిట్ అధికారులు బాధితులను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏకంగా బాధితుల ఇంటికి వెళ్లి.. తప్పు వ్యభిచారం కేులు పెడతామని బెదిరించడం వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు.

తాను ప్రజ్వల్ రేవణ్ణను సమర్థించడం లేదని చెబుతూనే.. ఈ కేసును ప్రపంచంలోనే అతిపెద్ద లైంగిక వేధింపుల కేసుగా చెప్పిన రెవెన్యూ మంత్రి కృష్ణ బైరి గౌడపై ప్రశ్నల వర్షం కురిపించారు. కిడ్నాపైన మహిళలను కాపాడి ఎక్కడ దాచారు ? ఎందుకు కోర్టులో ప్రవేశ పెట్టడం లేదు? ఈ వీడియోలను వైరల్ చేయడాన్ని సమర్థిస్తున్నారా ? అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ చట్టాని గౌరవించాలని, దోషులకు కచ్చితంగా శిక్షపడాలని తెలిపారు.


Also Read: ప్రజ్వల్ రేవణ్ణపై మరో కేసు.. గ్లోబల్ లుకౌట్ నోటీసులు జారీ

మరోవైపు సిట్ చేస్తున్న దర్యాప్తును కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర సమర్థించారు. జేడీఎస్ చేస్తున్న అన్ని ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంకు లేదన్నారు. సిట్ దర్యాప్తుపై అనుమానాలుంటే.. ఫిర్యాదు చేయవచ్చని అన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు. వీడియోల ద్వారా బాధితుల్ని ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×