BigTV English

AP Elections 2024: చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి: సీఎం జగన్

AP Elections 2024: చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి: సీఎం జగన్

YS Jagan Mohan Reddy news(AP political news): చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబును నమ్మితే గోవిందా.. గోవిందా అని ఏద్దేవా చేశారు. 2014లో చంద్రబాబు దొంగ హామీలిచ్చారన్నారు. మళ్లీ ఇప్పుడు అమలుకు సాధ్యం కాని హామీలిస్తున్నారని సీఎం జగన్ తెలిపారు.


చోడవరం రోడ్ షోలో పాల్గొన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శల వర్షం గుప్పించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు జన్మభూమి కమిటీలతో దోచుకున్నారని అన్నారు. చంద్రబాబు సీఎంగా పనిచేసిన కాలంలోని ఒక్క స్కీమ్ అయినా గుర్తొస్తుందా అని అన్నారు. 2014 ఎన్నికలకు ముందు జాబ్ రావాలంటే బాబు రావాల్సిందేనని అన్నారని ఉద్యోగాలిచ్చారా అని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వంతో రాజీపడి చంద్రబాబు ప్రత్యేక హోదాను తుంగలో తొక్కారని సీఎం జగన్ మండిపడ్డారు. చంద్రబాబును నమ్మడమంటే కొండచిలువ నోట్లో తలపెట్టడం లాంటిదని ఎద్దేవా చేశారు. డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి బాబు మహిళలను మోసం చేశారన్నారు. సింగపూర్ తరహా రాజధాని అని విశాఖను చంద్రబాబు వదిలేశారని తెలిపారు. గ్రాఫిక్స్ రాజధాని కూడా లేదని అన్నారు. ఇంటింటికీ కేజీ బంగారం.. బెంజ్ కార్ ఇస్తానన్న చంద్రబాబును నమ్మొచ్చా అని సీఎం జగన్ అన్నారు.


Also Read: ఈనెల 30న కూటమి మేనిఫెస్టో.. మాఫియా డాన్‌లతో పోరాడుతున్నాం..

ఎన్నికల్లో చంద్రబాబు డబ్బు ఇస్తే వద్దనొద్దని.. అది మన డబ్బేనని.. తీసుకొని ఓటేసే ముందు ఆలోచించడని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఎవరి వల్ల మంచి జరిగిందో ఆలోచించాలని అన్నారు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని అన్నారు. 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని వినిపించారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×