Free Gas Cylinder Updates: ప్రభుత్వ పథకాల గురించి నిత్యం ఏదో ఒక వార్త చెబుతూనే ఉంటుంది ప్రభుత్వం. ఏపీలో కూటమి సర్కార్ ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీమ్ అమలు చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించి కీలక సమాచారం బయటపెట్టింది. దీపం-2 పథకం కింద రెండో విడత సిలిండర్ రాయితీ పొందనివారు ఈనెలాఖరులోగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
దీపం-2 పథకం ఉచిత సిలిండర్ సంబంధించి కీలక సమాచారం వచ్చింది. రెండో విడత సిలిండర్ రాయితీ పొందనివారు ఈనెలాఖరులోగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల ఆగస్టు నుంచి మూడో సిలిండర్ బుకింగ్స్ మొదలు కానున్న నేపథ్యంలో రెండో విడత సిలిండర్ బుకింగ్ పెండింగ్ ఉన్నవారు జూలై చివరిలోపు బుక్ చేసుకోవాలి.
అయితే రాయితీ డబ్బులు 48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాలో జమ కానున్నాయి. మరోవైపు దీపం-2 పథకాన్ని మరింత సులభతరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఇకపై లబ్ధిదారులు ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.
కొత్త విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. రెండో విడతలో 91.10 లక్షల మందికి ఉచిత గ్యాస్ అందించినట్లు సమాచారం. ఇందుకోసం ప్రభుత్వం 712 కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రజలకు ఉపశమనం కలిగించడానికి దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.
ALSO READ: ఉప్పాడ తీరంలో రాకాసి అలలు.. సముద్రంలోకి మూడు గ్రామాలు
దీపావళి నుంచి ఈ పథకాన్ని అమలు చేసింది. ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం వల్ల మధ్యతరగతి, BPL కుటుంబాలకు రిలీఫ్. దీపం పథకం అర్హతలు చాలా ముఖ్యమైనవి. వినియోగదారుడు తప్పనిసరిగా శాశ్వత నివాసి అయి ఉండాలి. BPL కార్డ్ హోల్డర్లు మాత్రమే దీపం పథకానికి అర్హులు. కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే ఈ పథకానికి అర్హులు.
ఒక కుటుంబం నుండి ఒక గ్యాస్ కనెక్షన్ ఉంటేనే మాత్రమే వర్తిస్తుంది. వారు మాత్రమే ఉచిత గ్యాస్ పథకానికి అర్హులు. ఏపీ దీపం పథకానికి కావలసిన ఈ డాక్యుమెంట్లు కావాలి. ఆధార్ కార్డ్, రేషన్ కార్డు కచ్చితంగా ఉండాలి. అలాగే గ్యాస్ కనెక్షన్ పత్రాలు, ఓటరు గుర్తింపు కార్డు ఉండాలి. దీనికితోడు బ్యాంక్ పాస్ బుక్, ప్రస్తుత బిల్లు, గ్యాస్ కనెక్షన్ బుక్ ఉండాలి.