Guava Leaves: ఉదయం పూట ఖాళీ కడుపుతో జామ ఆకులను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా ? ఆయుర్వేదంలో జామ ఆకులను చాలా కాలంగా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. వీటిలో ఉండే ఔషధ గుణాలు పలు రకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగపడతాయి. ఉదయాన్నే పరగడుపున జామ ఆకులను నమలడం లేదా వాటి జ్యూస్ తాగడం కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జామ ఆకులతో కలిగే ప్రయోజనాలు:
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
పరగడుపున జామ ఆకులను తినడం వల్ల జీర్ణవ్యవస్థకు చాలా మేలు జరుగుతుంది. జామ ఆకులలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు కడుపులోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి, మంచి బ్యాక్టీరియా వృద్ధికి సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధకం, అతిసారం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవారికి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు తరచుగా జామ ఆకులు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది:
మీరు బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే.. జామ ఆకులు మీకు మంచి ఎంపిక. ఇవి కార్బోహైడ్రేట్‌లను చక్కెరగా మార్చే ఎంజైమ్‌లను అడ్డుకుంటాయి. దీనివల్ల శరీరం తక్కువ గ్లూకోజ్‌ను గ్రహిస్తుంది. అలాగే.. జామ ఆకులలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా అధిక ఆహారం తీసుకోవడాన్ని నివారిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది:
మధుమేహంతో బాధపడేవారికి జామ ఆకులు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో ఉండే సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. భోజనం తర్వాత చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడానికి జామ ఆకుల టీ తాగడం మంచిది. పరగడుపున జామ ఆకులను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
నోటి ఆరోగ్యానికి మంచిది:
జామ ఆకులలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నోటి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. పరగడుపున జామ ఆకులను నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. అంతే కాకుండా దంతాల నొప్పి, చిగుళ్ల వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇవి నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి.. నోటిని శుభ్రంగా ఉంచుతాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
జామ ఆకులలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. బలమైన రోగనిరోధక శక్తి శరీరాన్ని అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఉదయాన్నే జామ ఆకులను తీసుకోవడం వల్ల శరీరం రోజంతా శక్తివంతంగా ఉంటుంది.
Also Read: ముఖానికి ఆవిరిపట్టడం వల్ల ఇన్ని లాభాలా ?
చర్మ ఆరోగ్యానికి మేలు:
జామ ఆకులు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. ఇది ముడతలు, మొటిమలు వంటి చర్మ సమస్యలను తగ్గించి.. చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది.
పరగడుపున జామ ఆకులను తినడం అనేది మీ రోజును ఆరోగ్యకరంగా ప్రారంభించడానికి ఒక సులభమైన, సహజమైన మార్గం. అయితే.. ఏదైనా కొత్త ఆహారపు అలవాటును ప్రారంభించే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.