BigTV English

Papikondala tour : పాపికొండల టూర్ కు గ్రీన్ సిగ్నల్..టిక్కెట్ ధర ఎంతో తెలుసా?

Papikondala tour : పాపికొండల టూర్ కు గ్రీన్ సిగ్నల్..టిక్కెట్ ధర ఎంతో తెలుసా?


Papikondala tour : గోదావరిలో విహారయాత్రకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. పాపికొండల సందర్శన కోసం నిర్వహించిన ట్రయల్ రన్ ​విజయవంతమైంది. సోమవారం వీఆర్​పురం మండలంలో ఎస్ఐ, ఎంపీడీఓ లాంచీల యజమానులతో కలిసి ట్రయల్​ రన్​ నిర్వహించారు. వీఆర్​పురం మండలం పోచవరం నుంచి పాపికొండలు దాటి తెల్లదిబ్బలు, కొర్టూరు వరకు లాంచీలో వెళ్లారు. అక్కడ పరిస్థితులను పరిశీలించారు. గోదావరిలో విహారయాత్ర చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నివేదిక ఇచ్చారు. దీంతో నవంబర్ 9 నుంచి గోదావరిలో విహారయాత్రకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్న తర్వాత టూరిస్టులు పాపికొండల యాత్రకు వెళ్లేందుకు భద్రాచలంలో టికెట్​ కౌంటర్లు ప్రారంభించారు. పెద్దలకు రూ. 950, పిల్లలకు రూ. 750గా టిక్కెట్ ధరను నిర్ణయించారు.


గోదావరి విహారయాత్ర కోసం 17 లాంచీలకు అనుమతినిచ్చారు. ఒక్కో లాంచీలో సామర్థ్యాన్ని బట్టి సందర్శకులను ఎక్కించుకునేందుకు అనుమతి ఇచ్చారు. ప్రతి లాంచీ పోచవరం నుంచి బయలుదేరి పాపికొండల్లోని కొర్టూరు వరకు వెళ్లి తిరిగి వస్తుంది. మధ్యలో పేరంటాలపల్లి ఆశ్రమ సందర్శన ఉంటుంది. మార్గమధ్యలో టీ, టిఫిన్​, భోజనం ఏర్పాటు చేస్తారు.

కార్తీకమాసంలో గోదావరిలో విహారయాత్ర చేసేందుకు సందర్శకులు భారీగా వస్తారు. ఈ నెలలో పాపికొండల అందాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. చలి వాతావరణంలో విహార యాత్రను ఆస్వాదిస్తారు. తెలుగురాష్ట్ట్రాల నుంచి గోదావరిలో విహారయాత్ర చేసేందుకు భారీగా సందర్శకులు వస్తారు. ఇందులో హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

Related News

Srikakulam News: లవ్ మ్యారేజీకి ఒప్పుకోవడం లేదని.. సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్.. చివరకు?

YSR CSO John Wesley: కొడుకు వర్ధంతి.. తల్లి అదే రోజు మృతి.. ఈ ఫ్యామిలీకి జగన్ కు సంబంధమేంటి?

Nellore Politics: కాకాణితో భేటీ.. నెల్లూరు నగర మేయర్ స్రవంతికి పదవీగండం

Smart Kitchen: సీకే దిన్నె ప్రభుత్వ పాఠశాలలో దేశంలోనే తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన మంత్రి లోకేష్

Jagan-Vijayamma: కలసిపోయిన జగన్, విజయమ్మ.. కొడుకు, కోడల్ని ముద్దు పెట్టుకుని..

Lokesh vs Jagan: ఓరి నీ పాసుల గోల.. జగన్‌పై లోకేష్ సెటైర్లు, మేటరేంటి?

Big Stories

×