Ntr Bharosa Pension: ప్రజలకు మరో శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఆగష్టు నుంచి ఒక్కొక్కరికి రూ.4 వేల చొప్పున పింఛన్ ఇవ్వనుంది. జూన్ నుంచి ఇవ్వాలని భావించినా కుదరలేదు. చివరకు ఆగస్టు నుంచి ఇస్తున్నారు. ఈ నెల నుంచి ప్రతి నెలా రూ.4 వేలు ఖాయం.
ఈనెల నుంచి ఫించన్ లబ్దిదారులకు ఒక్కొక్కరికి నెలకు రూ.4వేలు చొప్పున ఇవ్వనుంది కూటమి సర్కార్. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా పింఛను పంపిణీ మొదలైంది.
ఆగస్టు పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.2,750 కోట్లు రిలీజ్ చేసింది. అయితే స్పౌజ్ కేటగిరి పింఛన్‌కు సంబంధించి ప్రభుత్వ హామీ ఇచ్చింది. పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే వారి భార్యలకు మరుసటి నెల నుంచి పింఛన్ ఇవ్వనుంది. ఆ విధంగా చాలామంది మహిళలకు పింఛన్ రాలేదు.
అలాంటి వారిని గుర్తించి స్పౌజ్ కేటగిరి కింద పింఛన్ మంజూరు చేస్తోంది కూటమి ప్రభుత్వం. స్పౌజ్ కేటగిరీ కింద 1,09,155 మందికి కొత్తగా వితంతువులకు పింఛన్ల మంజూరు చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
ALSO READ: జగన్ టీమ్ తప్పుడు ఈమెయిల్స్.. రికార్డులు సరి చేయడానికి సింగపూర్ టూర్
వైసీపీ హయాంలో స్పౌజ్ కేటగిరి కింద పింఛన్లు ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌజ్ కేటగిరిలో పింఛన్ పథకాన్ని తీసుకొచ్చింది. రెండేళ్ల కిందట అంటే 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య పింఛను తీసుకుంటూ చనిపోయినవారి పింఛను వారి భార్యలకు బదిలీ చేయనుంది.
దీనికి సంబంధించి అన్ని చర్యలు చేపట్టింది. చనిపోయిన వ్యక్తి వివరాలు, మరణ ధ్రువీకరణ పత్రం, దీనికితోడు జీవిత భాగస్వామి వివరాలను తీసుకుని గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాలి. అక్కడ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న తర్వాత కొత్త పింఛన్ విడుదల కానుంది. జూన్‌లో పంపిణీ చేయాలని భావించారు. అప్పటి ఇంకా రాష్ట్రవ్యాప్తంగా లెక్కలు రాలేదు.
చివరికి ఆగష్టు నుంచి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. స్పౌజ్ కేటగిరిలో అర్హులకు రూ.4 వేల చొప్పున ఫించన్ అందిస్తారు. ప్రతీ నెల ఒకటి తారీఖున ఫించన్ల కార్యక్రమంలో పాల్గొంటారు. ఈసారి సీఎం చంద్రబాబు కడప జిల్లా జమ్మలమడుగులోని గూడెం చెరువులో పర్యటిస్తారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడతారు.
ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. చివరకు గండికోటకు వెళ్లి అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గండికోట నుంచి బయలుదేరి కడపకు చేరుకుంటారు. అక్కడిని హెలికాప్టర్‌లో గన్నవరం చేరుకుంటారు. గన్నవరం నుంచి ఉండవల్లి నివాసానికి రానున్నారు సీఎం చంద్రబాబు.