BigTV English

OTT Movie : ఇదేం మాయ రోగంరా అయ్యా… అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు వైరల్… పిచ్చెక్కించే మలయాళ సైకో థ్రిల్లర్

OTT Movie : ఇదేం మాయ రోగంరా అయ్యా… అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు వైరల్… పిచ్చెక్కించే మలయాళ సైకో థ్రిల్లర్

OTT Movie : సైబర్ నేరాలతో ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెరకెక్కిన ఒక మూవీ అందరిని ఆలోచింపజేస్తోంది. ఈ సినిమా రెండు గదులలో, నాలుగు పాత్రలతో, 70% స్కైప్ సంభాషణలతో జరుగుతుంది. అసభ్య వీడియోలకు అడిక్ట్ అయిన ఒక వ్యక్తి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ సినిమా 19వ గొల్లపూడి శ్రీనివాస్ నేషనల్ అవార్డ్‌లో ఉత్తమ తొలి దర్శకుడిగా నామినేట్ అయింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే.


నాలుగు ఓటీటీలలో స్ట్రీమింగ్

ఈ మిస్టరీ-థ్రిల్లర్ మూవీ పేరు ‘లెన్స్’ (Lens) . దీనికి జయప్రకాశ్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒకేసారి మలయాళం, తమిళ భాషల్లో రూపొందింది. ఈ సినిమాలో జయప్రకాశ్ రాధాకృష్ణన్, ఆనంద్ సామి, మిషా ఘోషల్, ఆశ్వతి లాల్, కులోతుంగన్ ఉదయకుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. లెన్స్ అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. వీటిలో CLAM ఫెస్టివల్ ఇంటర్నేషనల్ సినిమా సోలిడారి, సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, జగ్రాన్ ఫిల్మ్ ఫెస్టివల్, చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉన్నాయి. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ ఐట్యూన్స్, గూగుల్ ప్లే మూవీస్, యూట్యూబ్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. తెలుగు సబ్‌టైటిల్స్‌తో కూడా చూడవచ్చు. IMDbలో 6.5/10 రేటింగ్‌ ను కూడా ఈ సినిమా పొందింది.


స్టోరీలోకి వెళితే

అరవింద్ ఒక పెళ్ళైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అయితే అతనికి ఒక చెడు అలవాటు ఉంటుంది. అతను ఆన్‌లైన్ లో అసభ్యకరమైన వీడియోలకు అలవాటు పడతాడు. వెబ్‌క్యామ్‌ల ద్వారా ఆడవాళ్ళతో చాట్‌లు కూడా చేస్తుంటాడు. ఈ అలవాటు వల్ల అతని భార్య స్వాతి తో అతని సంబంధం దెబ్బతింటుంది. ఆమె అతని పట్ల దూరం అవుతుంది. అరవింద్ తన అలవాటును రహస్యంగా ఉంచుతూ, తన గోప్యతను కాపాడుకోవడానికి సల్మాన్ ఖాన్ మాస్క్ ఉపయోగిస్తాడు. ఒక రోజు అరవింద్‌కు “నిక్కీ” అనే పేరుతో ఒక అపరిచితురాలి నుండి స్కైప్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. అతను ఆమెతో చాట్ చేయడం మొదలెడతాడు. కానీ త్వరలోనే నిక్కీ ఒక స్త్రీ కాదని, యోహన్ అనే వ్యక్తి అని తెలుస్తుంది. యోహన్ అరవింద్‌ను బెదిరిస్తాడు. అతను అరవింద్‌ ఆన్‌లైన్ వీడియోలను రికార్డ్ చేశానని, అరవింద్ తన ఆత్మహత్యను స్కైప్‌లో లైవ్‌గా చూడకపోతే, ఆ వీడియోలను బయటపెడతానని బెదిరిస్తాడు. అరవింద్ భయపడి యోహన్ ఆదేశాలను అనుసరించడం మొదలెడతాడు. కానీ ఈ భయంకరమైన డిమాండ్ వెనుక సీక్రెట్ ఏమిటి? అతను అరవింద్‌ను ఎందుకు ఎంచుకున్నాడు? ఈ ప్రశ్నలు కథను ముందుకు నడిపిస్తాయి.

Read Also : కన్న కూతుర్ని బోన్ పెట్టి టార్చర్ చేసి చంపే తల్లి… బుర్రపాడు ట్విస్ట్… గుండెల్లో గుబులు పుట్టించే హారర్ సీన్స్

సినిమా ఎక్కువగా ఈ ఇద్దరు పాత్రల మధ్య స్కైప్ సంభాషణ చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక క్లాస్ట్రోఫోబిక్ థ్రిల్లర్‌గా మారుతుంది. యోహన్ గతం ఫ్లాష్‌బ్యాక్‌ల ద్వారా బయటికి వస్తుంది. ఇక్కడ అతని భార్య ఏంజెల్ జీవితంలో జరిగిన విషాదకర సంఘటనలు వెలుగులోకి వస్తాయి. యోహన్ ఒక సైబర్ నేరం బాధితుడు. అతని ఆత్మహత్య బెదిరింపు అరవింద్‌తో సంబంధం ఉన్న ఒక రివెంజ్ స్టోరీగా మారుతుంది. అసలు రహస్యం తెలిసి అరవింద్ తన గురించి గిల్ట్‌తో పోరాడుతాడు. క్లైమాక్స్ అందరిని ఆలోచనలో పడేస్తుంది. యోహన్ గతం ఏమిటి ? అరవింద్‌ కి యోహన్ గతానికి సంబంధం మితి ? యోహన్ లైవ్ లో ఆత్మహత్య చేసుకుంటాడా ? అనే విషయాలనుఈ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Related News

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : ప్రతీ రాత్రి ఒకరిని చంపే డెడ్లీ డెత్ గేమ్… కంటికి కన్పించకుండా నరకం చూపించే మాఫియా… ఒక్కో సీన్ కు గూస్బంప్స్

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయి అరాచకం… తెలియకుండానే సైకో కిల్లర్ ఉచ్చులో… లాస్ట్ లో మతిపోగోట్టే ట్విస్ట్

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

Big Stories

×