BigTV English

Trump film ‘The Apprentice’ controversy: ట్రంప్‌కు సినిమా ఎఫెక్ట్, ఆపై..

Trump film ‘The Apprentice’ controversy: ట్రంప్‌కు సినిమా ఎఫెక్ట్, ఆపై..

Trump film ‘The Apprentice’ controversy: అమెరికాలో మరోసారి అధ్యక్ష పీఠం ఎక్కేందుకు ఉవ్విళ్లూరుతున్నారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్. తన పార్టీలో మిగతా అభ్యర్థులను ఓడించి రేసులో ముందు నిలిచారు. దాదాపుగా తన సీటును ఖాయం చేసుకున్నారు.


మరోవైపు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థులకు ధీటుగా సమాధానాలు ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సినిమా రూపంలో ట్రంప్‌కు పెద్ద చిక్కు వచ్చిపడింది. ఇంతకీ సినిమాకు-ట్రంప్‌కు లింకేంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.

బిజినెస్‌మెన్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ బయోపిక్ ’ద అప్రెంటైస్‘. ఈ ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సిఉంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఇందులో తప్పేముందని అనుకుంటున్నారా? ట్రంప్ జీవితంలోకి పర్సనల్ లైఫ్‌కి సంబంధించి కొన్ని సీన్లను తెరకెక్కించారు. మాజీ వైఫ్ ఇవానాపై ట్రంప్ అత్యాచారం చేసినట్టు ఓ సీన్ అందులో వుంది. ఈ సన్నివేశాన్ని చూసి షాకయ్యారు కేన్స్ ఆడియన్స్. 1970 దశకంలో ట్రంప్ వ్యాపార జీవితాన్ని ప్రస్తావించినప్పటికీ, కొన్ని చీకటి విషయాలను బయటకు పెట్టారు.


ద అప్రెంటైస్ చిత్రంపై అమెరికా అంతటా చర్చ జరుగుతోంది. పరిస్థితులను గమనించిన ట్రంప్ టీమ్, ఆయనకు పెద్ద దెబ్బగా వర్ణిస్తోంది. తొలుత ఈ సిన్మాను తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావించారాయన. కాకపోతే కాంట్రవర్సీ సీన్స్ పెట్టడంతో తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావిస్తోంది. ఈ క్రమంలో న్యాయస్థానంలో దావా వేస్తున్నట్లు ట్రంప్ టీమ్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది.

ALSO READ: విమానంలో భారీ కుదుపులు.. ఒకరు మృతి, 30 మందికి గాయాలు!

మరోవైపు ట్రంప్ టీమ్ ప్రకటనపై ద అప్రెంటైస్ మూవీ డైరెక్టర్ అలీ అబ్బాసీ రియాక్ట్ అయ్యారు. డొనాల్డ్ టీమ్ తప్పకుండా చిత్రాన్ని చూడాలని, ఆ తర్వాతే దావా వేయాలని అంటున్నారు. ఆయన ఎలా సక్సెస్ అయ్యారనేది అందులో చూపించామని అంటున్నారు. ఈ ఫిల్మ్‌ని ట్రంప్ చూస్తే తప్పకుండా మెచ్చు కుంటారని అంటున్నారు. ట్రంప్ పాత్రను నటుడు సెబాస్టియన్ స్టాన్ నటించాడు. ఆయన వ్యక్తిగత అడ్వకేట్‌గా రోయ్‌కోన్, ఇవానా‌ట్రంప్ రోల్‌‌లో మానిచా బారాలో నటించారు. మరి సినిమా ప్రభావం అమెరికా అధ్యక్ష ఎన్నికలపై పడుతుందో లేదో చూడాలి.

Tags

Related News

Afghan Women: అఫ్ఘాన్ భూకంప శిథిలాల్లో మహిళలు.. బతికున్నా రక్షించకుండా వదిలేసిన మగాళ్లు!

MRI Accident: మెడలో మెటల్ చైన్‌తో ఎంఆర్ఐ గదిలోకి.. క్షణాల్లో ప్రాణం గాలిలోకి.. ఎక్కడంటే?

Donald Trump: భారత్‌తో సంబంధాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు… కుట్రబుద్ధి ఉన్న చైనాతో..?

Putin: 150 ఏళ్లు బతకొచ్చు.. ఎలాగంటే..! పుతిన్ చెప్పిన సీక్రెట్స్..

China Military Parade: ఆ ముగ్గురు కలిస్తే తట్టుకోవడం కష్టమే.. భయంలో ట్రంప్

India USA: మోదీ మైండ్ గేమ్.. ట్రంప్ చాప్టర్ క్లోజ్! ఇండియా లేకపోతే అమెరికా పరిస్థితి ఇదే..

Big Stories

×