BigTV English

AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఐదు రోజుల ముందే రేషన్

AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఐదు రోజుల ముందే రేషన్

AP Govt:  ఏపీలో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజలు ఏ మాత్రం ఇబ్బందిపడకుండా ఉండేలా జాగ్రత్త తీసుకుంటోంది. ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా నెలకు ఐదురోజులుగా ముందుగానే రేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.


లబ్దిదారులకు రేషన్ సరఫరా విషయంలో కీలక మార్పులు చేస్తున్నారు ఆ శాఖ మంత్రి నాదెండ్ల మనోహన్. ఆయన చేస్తున్న పనులు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. తాజాగా ఐదు రోజుల ముందే రేషన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. పండగ, ఏదైనా అనుకోని సందర్భాల్లో మాత్రమే రేషన్ ముందుగా ఇస్తుంటారు.

మహా అంటే ప్రతీనెల ఒకటి లేదా రెండు తేదీన ఇవ్వడం చూశాం. కానీ ఏపీలో మాత్రం రెండు సెక్షన్ల వర్గాల లబ్దిదారులకు ఐదు రోజుల ముందుగానే రేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ప్రతీనెల 26 లేదా 27 న రేషన్ సరుకులు తీసుకునేందుకు ఆయా లబ్దిదారులు రెడీగా ఉండాలి. ఈసారి ఆయా లబ్దిదారులు ఒకటో తారీఖు వరకు చూడాల్సిన పని లేదు.


వృద్ధులు, దివ్యాంగులకు ఐదు రోజుల ముందు రేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతీ నెలా ఐదురోజుల ముందుగానే వారికి రేషన్ ఇవ్వనున్నారు. 65 ఏళ్లు దాటిన ముసలివారు, దివ్యాంగులకు రేషన్ సరుకుల్ని ఇవ్వనున్నారు. జూన్ లో 13, 14, 000 మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికి రేషన్ సరుకులను తీసుకెళ్లి ఇచ్చారు.

ALSO READ: రికార్డు బద్దలు కొట్టిన శ్రీవారి భక్తులు అందరి చూపు తిరుమల వైపు

ఒక్కరోజు అందరికీ పంపిణీ చేయడం కష్టం. 26, 27, 28, 29, 30 తేదీల్లో ఇవ్వనుంది. మధ్యలో ఆదివారాలు వచ్చినా మరసటి రోజుకి బదిలీ చేస్తారు. రేషన్ డీలర్లు తమ వీలును బట్టి సరుకులను లబ్దిదారులకు అందిస్తారు. ఇతరులకు ఎప్పటి మాదిరిగా ప్రతీ నెల ఒకటి నుంచి ఇవ్వనున్నారు. వారైతే రేషన్ డిపోలకు వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సి ఉంటుంది.

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. హాస్టళ్ల విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారమే జూన్ 12 నుంచి భోజనం పెడుతున్నారు. పిల్లల విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రేషన్‌లో సన్నబియ్యం ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై పరిశీలిస్తున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.  దీనికి సంబంధించి సదరు మంత్రి రైస్ మిల్లర్లతో భేటీ అయ్యారు. సన్నబియ్యం పండించేలా రైతులను ప్రోత్సహిస్తామని, మిల్లర్లు వాటిని ప్రోత్సహించాలని కోరారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో సన్నబియ్యం దిగుబడి పెరిగే ఛాన్స్ ఉంది.

ప్రజల ఆహార అలవాట్లను దృష్టిలో పెట్టుకొని ఆ తరహా రకం ప్రొత్సహిస్తున్నామని అంటున్నారు. రాబోయే కొద్దిరోజుల్లో రేషన్‌ డిపోల్లో సన్నబియ్యం ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీనిపై ఆ శాఖ మంత్రి నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సివుంది.

Related News

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Big Stories

×