Viral Video: దేశంలో కొత్త ట్రెండ్ మొదలైంది. పాశ్యాత్య దేశాల కల్చర్ ఇండియాకి బాగానే సోకినట్టు కనిపిస్తోంది. రీసెంట్‌గా జరిగిన ఘటన నేపథ్యంలో మహిళలు తాము కోరుకున్న వాడితో రెండో వివాహం చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా అలాంటి వ్యవహారం బీహార్‌లో ఒకటి వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
హనీమూన్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇండోర్‌కి చెందిన రాజా రఘువంశీ-సోనమ్ జంట హనీమూన్ పేరుతో మేఘాలయం వెళ్లింది. పెద్దలు జరిపిన పెళ్లి ఇష్టంలేని సోనమ్, తన భర్తను కిరాయి మూకలతో కలిసి చంపించింది. ఈ ఘటనలో లోతుకు వెళ్లిన కొద్దీ అసలు విషయాలు బయటపడ్డాయి. తనకు ఇష్టంలేని పెళ్లి చేసినందుకు భర్తను చంపినట్టు చివరకు తేలింది.
సీన్ కట్ చేస్తే.. బీహార్‌లోని జముయ్‌లో ఓ మహిళ తన భర్త ముందు మేనల్లుడిని రెండో మ్యారేజ్ చేసుకుంది. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది. ఆ వ్యక్తి.. తన మామ, ఇతర కుటుంబ సభ్యుల మధ్య అత్తను వివాహం చేసుకున్నాడు.
బీహార్‌లోని జముయ్ జిల్లా సిఖేరియా గ్రామంలో ఈ వ్యవహారం చోటు చేసుకుంది. నాలుగేళ్ల కిందట విశాల్ దూబేను వివాహం చేసుకుంది ఆయుషి కుమారి. పెళ్లి జరిగిన నాలుగేళ్లలో మూడేళ్ల కూతురు ఉంది. అయితే పెళ్లికి ముందు నుంచే ఆయుషి కుమారి దగ్గర బంధువు, మేనల్లుడు సచిన్ దూబే రిలేషన్ షిప్‌లో ఉంది.
ALSO READ: ఇచ్చేయండి సార్.. ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్, పాపం ఇన్ని కష్టాలా?
తొలుత సోషల్‌మీడియాలో పరిచయంతో ఒకరితోనొకరు మాట్లాడుకోవడం మొదలైంది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఫోన్‌లో మాట్లాడుకోవడం కొనసాగించారు. వీలు చిక్కినప్పుడల్లా కలుసుకోవడం జరుగుతోంది. రిలేషన్ షిప్‌ని కుటుంబంలో ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది ఆయుషి కుమారి.
జూన్ 15న సచిన్‌తో ఆయుషి పారిపోయినప్పుడు వీరి ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భార్య కనిపించడం లేదని ఆమె భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అసలు గుట్టు బయటకు తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసు స్టేషన్ నుంచి ఈ వ్యవహారం ఆయుషి ఇంటికి చేరింది. తాను చెప్పాల్సింది భర్తతో చెప్పేసింది ఆయుషి.
దీంతో విశాల్ తన భార్యకు దగ్గరుండి ఆమె మేనల్లుడితో వివాహం జరిపించాడు. రెండు కుటుంబాల అంగీకారంతో ఒక గ్రామంలోని ఓ దేవాలయంలో సచిన్‌ను వివాహం చేసుకుంది ఆయుషి కుమారి. ఆయుషిని తాను ఎప్పటికీ సంతోషంగా ఉంచుతానని సచిన్ చెప్పుకొచ్చాడు. ఇప్పటి నుంచి కూతురు బాధ్యతను సచిన్ తీసుకుంటాడని మొదటి భర్త విశాల్ చెప్పుకొచ్చాడు.
ఈ మధ్యకాలంలో ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇలాంటి వ్యహారాలు చోటు చేసుకున్నాయి. భర్తలు వారి భార్యలకు దగ్గరుండి పెళ్లి జరిపించారు. మొత్తానికి గడిచిన నాలుగైదు నెలలుగా చూస్తుంటే మహిళలు తాము కోరుకున్నవాడ్ని పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. బహుశా పాశ్యాత్య దేశాల కల్చర్ క్రమంలో ఇండియాలోకి ఎంటరైందన్నది కొందరు వ్యక్తులు బలంగా చెబుతున్నారు.
चाची ने की भतीजे से लव मैरिज, चुपचाप सामने खड़ा रहा पति।
बिहार के जमुई में एक महिला पर प्यार का ऐसा जुनून चढ़ा कि उसने भतीजे को ही पति बना लिया. महिला ने रिश्ते के भतीजे के साथ मंदिर में शादी रचाई जहां उसका पति भी मौजूद था. pic.twitter.com/bxZNyTQVby
— प्रभाकर पाण्डेय (@I_PP17) June 21, 2025