AP Govt: ఏపీలో కూటమి సర్కార్ ప్రజల ఆలోచనకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రభుత్వ సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటి నుంచే ప్రభుత్వ సర్వీసులు పొందుతున్నారు. తాజాగా డ్వాక్రా సంఘాల మహిళలకు తీపికబురు చెప్పింది. లోన్ కోసం ఇకపై బ్యాంకులకు వెళ్లకుండా టెక్నాలజీ అనుసంధానం చేసే పనిలో నిమగ్నమైంది ప్రభుత్వం.
డ్వాక్రా సంఘాలకు శుభవార్త
డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాల చెల్లింపుల్లో కొత్త కొత్త మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిని అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సభ్యులు రుణ వాయిదాలను సంఘం లీడర్‌కి గానీ, వీవోఏలకు ఇచ్చి చెల్లింపులు చేసే విధానానికి చెక్ పెట్టనుంది. అందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ని తీసుకొచ్చే పనిలో నిమగ్నమైంది. దీనివల్ల డ్వాక్రా సభ్యుల పని మరింత తేలికవుతుంది.
డ్వాక్రా సంఘాల సభ్యులను టెక్నాలజీతో అనుసంధానం చేసేందుకు రెడీ అయ్యింది ప్రభుత్వం. సభ్యులు రుణ వాయిదాల చెల్లింపుల కోసం ప్రతి నెల బ్యాంకుకు వెళ్తారు. అక్కడ గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ సమస్యను అధిగమించేందుకు, స్వయం సహాయక సంఘాల రుణ చెల్లింపు సులభంగా జరిగనుంది.
రుణం తీసుకునేలా కొత్త విధానం
ఆ కొత్త యాప్‌తో స్వయం సహాయక సంఘాల సభ్యులు సులభంగా, పారదర్శకతతో రుణాల చెల్లింపులు చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో సభ్యులకు తెలియకుండానే వారి పేరు మీద రుణాన్ని తీసుకుంటున్నారు. ఈ తరహా మోసాలకు ఇకపై చెక్ పడడం ఖాయం. సభ్యురాలి బయో మెట్రిక్ ద్వారానే రుణాన్ని అందించేలా కొత్త విధానాన్ని తీసుకురానుంది.
ALSO READ: మరో బాంబు పేల్చిన కేశినేని నాని, సీఎం చంద్రబాబుకు లేఖ
ఏ అవసరం కోసం రుణం తీసుకుంటున్నారో దానికి సంబంధించిన రెజెల్యూషన్ డిజిటల్ విధానంలో రానుంది. ఇకపై ప్రతి సంఘానికి ఒక యూనిక్ ఐడీని కేటాయిస్తున్నారు. ఈ నెంబర్, రెజెల్యూషన్‌ను పరిశీలించిన తర్వాత బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. డ్వాక్రా మహిళలకు కూటమి సర్కార్ భారీ సంఖ్యలో రుణాలు ఇవ్వనుంది.
మార్చిలోపు 89 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.61,964 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. అగ్రికల్చర్, ఫిషరీస్, హార్టికల్చర్, పశు సంపద, సెరీ కల్చర్ ఇతర రంగాలకు సంబంధించి రుణాలు మంజూరు చేయనుంది. డ్వాక్రా మహిళలు కోరుకున్న రంగాల్లో వారికి ట్రైనింగ్ ఇచ్చేందుకు ఒక ప్రణాళిక రెడీ చేసింది.