AP Ration cards: ఏపీలో టెక్నాలజీ పరంగా కీలకమైన మార్పులు-చేర్పులు చేస్తోంది చంద్రబాబు సర్కార్. ప్రభుత్వం నుంచి లబ్దిదారులకు అందే పథకాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేయడంతో అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తోంది. దీనివల్ల నిజమైన లబ్దదారులకు ప్రయోజనం చేకూరనుంది. తాజాగా రేషన్ కార్డులో ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక మార్పులు చేశారు.
రేషన్ కార్డుల స్థానంలో డిజిటల్ కార్డులు
ఇకపై కొత్త రేషన్‌కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. వాట్సాప్ సర్వీసుల్లో స్పీడ్ పెంచింది ఏపీ ప్రభుత్వం. పేపర్ వర్క్ తగ్గించేలా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే రేషన్ కార్డులున్నవారికి ఇకపై స్మార్ట్ కార్డులు జారీ చేయనుంది. జూన్‌లో లబ్దిదారులకు డిజిటల్ రేషన్ కార్డులు ఇవ్వనుంది. ఇప్పటి వరకు 72 వేలకు పైగా స్మార్ట్ కార్డులు లబ్దిదారులకు అందజేశామన్నారు. దీన్ని మరింత వేగవంతం చేయాలని ఆలోచన చేస్తోంది.
గుంటూరు ఆదివారం మీడియాతో మాట్లాడిన మంత్రి నాదెండ్ల మనోహర్, రేషన్ కార్డుల్లోని సభ్యుల ఈ-కేవైసీ నమోదులో దేశంలో ఏపీ ఫస్ట్ ప్లేస్‌లో ఉందన్నారు. 95 శాత ఈ-కేవైసీ పూర్తయినట్లు తెలిపారు. కోటి 46 లక్షల 21 వేల రేషన్ కార్డులు ఉన్నాయి. వాటికి సంబంధించి 4 కోట్ల 24 లక్షల 59 వేల మంది సభ్యులున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో బియ్యం కార్డుల్లో మార్పులు, చేర్పులు మొదలుపెట్టింది ప్రభుత్వం.
నూతన కార్డులకు దరఖాస్తుల స్వీకరణతోపాటు 6 రకాల సేవలు అందించే ప్రక్రియ వేగవంతం అయ్యింది. మరో మూడు రోజులు అంటే మే 15 నుంచి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ఇంటి నుంచే ఈ సేవలు పొందే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రజలు వాట్సాప్ నెంబర 95523 00009 కు హలో అన్న సందేశం పంపడం ద్వారా ఆయా సేవలను పొందవచ్చని తెలిపింది.
ALSO READ: టీటీడీ కళాశాలల్ల ప్రవేశాు, అప్లై చేయండి
జూన్ నుంచి డిజిటల్ రేషన్ కార్డులు ప్రక్రియ మొదలుకానుంది. ఏపీలో తొలిసారి ఒంటరి వారికి రేషన్ కార్డు ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. కళాకారులుగా పింఛను అందుకుంటున్న వారికి గిరిజన బృందాలకు ప్రత్యేకంగా అంత్యోదయ కార్డుల ద్వారా నెలకు 35 కిలోల బియ్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే లింగ మార్పిడి జరిగిన వారికీ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి నాదెండ్ల చెప్పుకొచ్చారు. ఈ-కేవైసీ నుంచి కొందరికి మినహాయింపు ఇచ్చింది ప్రబుత్వం. వారిలో ఏడాదిలోపు పిల్లలు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఉన్నారు.
కార్డుల్లో మార్పులు చేర్పులకు వీటిని తీసుకెళ్లాలి?
కొత్త రైస్ కార్డ్ కోసం దరఖాస్తు ఈ నిబంధనలు పాటించాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.2 లక్షలకు లోపు ఉండాలి. GSWS హౌస్ హోల్డ్ డేటాబేస్ నందు నమోదుకావాలి. వారిలో ఎవరికీ రేషన్ కార్డు ఉండరాదు. కుటుంబసభ్యుల ఆధార్ కార్డులు కచ్చితంగా తీసుకెళ్లాలి.
రేషన్ కార్డుల్లో సభ్యులను చేర్చడానికి వీటిని తమతో తీసుకుని లబ్దిదారులు వెళ్లాల్సి వుంటుంది. వివాహం లేదా జననం ద్వారా కుటుంబంలో మార్పుకి సంబంధించి పత్రాలు ఉండాలి. చేర్చాల్సిన వ్యక్తి ఆధార్ కార్డు, ప్రస్తుతం రేషన్ కార్డ్, కార్డ్ హోల్డర్ కు సంబంధించిన ఆధార్ కార్డు తప్పనిసరి.
రేషన్ కార్డు విభజన అర్హతలు ఈ విధంగా ఉన్నాయి. ఒకే కార్డులో రెండు కుటుంబాలు ఉన్నప్పుడు అవసరమైన పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత సభ్యుల ఆధార్ కార్డులు, వివాహ ధృవీకరణ పత్రం ఉండాలి. అలాగే ప్రస్తుతం రేషన్ కార్డు, కార్డ హోల్డర్ ఆధార్ కార్డు ఇవ్వాల్సివుంటుంది.
సభ్యుడిని తొలిగించడం ఇవి ఫాలో కావాలి. సభ్యుడు మరణించినప్పుడు అవసరమైన పత్రాలు చూపించాలి. తొలుత మరణ ధృవీకరణ పత్రం, సంబంధిత వ్యక్తి ఆధార్ కార్డు ఉండాల్సిందే. ప్రస్తుతం రేషన్ కార్డు, కార్డ్ హోల్డర్ ఆధార్ కార్డు చూపించాలి.
తప్పుగా ఉన్న ఆధార్ సీడింగ్ సవరణ ఈ పత్రాలు చూపించాలి. రేషన్ కార్డులో సభ్యుడి ఆధార్ వివరాలు తప్పుగా ఉన్నప్పుడు సభ్యుడి ఆధార్ కార్డు ఉండాలి. అలాగే ప్రస్తుతం రేషన్ కార్డు, కార్డ్ హోల్డర్ ఆధార్ కార్డు కచ్చితంగా చూపించాలి.