BigTV English

AP Govt: ఏపీలో ఆ కష్టాలకు ఇక చెల్లు.. వేలు అవసరం లేదు.. అంతా ఉచితమే!

AP Govt: ఏపీలో ఆ కష్టాలకు ఇక చెల్లు.. వేలు అవసరం లేదు.. అంతా ఉచితమే!

AP Govt: ఏపీలో ఆ కష్టాలకు ఇక చెల్లు. మనిషి మరణంలోనూ, తప్పని తిప్పలు కోకొల్లలు. మృతదేహాలను బైక్ పై, ఎద్దుల బండిపై, లేకుంటే ఒక్కరే ఎత్తుకొని తీసుకుపోయిన సంధర్భాలు ఎన్నో ఎన్నెన్నో మనకు కనిపిస్తాయి. ఆ కష్టాలకు చెక్ పెట్టేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో మృతువు సమయంలోనూ, ఆర్థిక భారం మోయలేని కుటుంబాలకు ఊపిరి అందినట్లే.


సాధారణంగా వైద్యశాలలో ఎవరైనా మరణిస్తే, ఆ మృతదేహాన్ని ఇంటికి తరలించాలంటే జేబులో డబ్బులు ఉండాలి. అంతేకాదు మృతదేహం అనగానే, భారీ మొత్తం చెల్లించుకోవాలి. ఇక పేద కుటుంబీకులైతే, ఆ బాధ వర్ణనాతీతం. ఓ వైపు కుటుంబంలోని వ్యక్తి మృతి, మరోవైపు చేతిలో చిల్లిగవ్వ లేక ఎందరో కన్నీరు కార్చిన ఘటనలు కూడా ఉన్నాయి. కొందరు స్వయంగా మోసుకెళ్లిన ఘటనలు ఉండగా, మరికొందరు బైక్స్ పై, సైకిళ్లపై కూడా మృతదేహాలను తీసుకెళ్లిన రోజులు ఉన్నాయి. ఈ కష్టాలను గుర్తించిన ప్రభుత్వం మరోమారు మహా ప్రస్థానం అంబులెన్స్ లను ప్రవేశపెట్టింది.

2014-19 టీడీపీ పరిపాలన కాలంలో మహా ప్రస్థానం అంబులెన్స్ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ తరువాత అనివార్య కారణాల వల్ల పథకం అమలు కాలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం, ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వెంటనే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు మహా ప్రస్థానం అంబులెన్స్ ఏర్పాటుపై అధికారులతో సమీక్షించారు. వెంటనే పథకం అమలులోకి రావాలని నిర్ణయించిన ఏపీ సర్కార్, ఏడాదికి వీటి నిర్వహణకు రూ. 9.54 కోట్లు ఖర్చు పెట్టనుంది.


Also Read: Borewell Incident: బోరుబావిలో 16 గంటలు.. బిడ్డ నరకం.. పూజల్లో తల్లి.. చివరికి మృత్యువు ఒడిలోకి!

అసలే మనిషి చనిపోయిన సమయంలో పడే రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వైద్యశాల నుండి మృతదేహాలను తరలించేందుకు కేవలం ఒక్క 108  కాల్ తో మహా ప్రస్థానం వాహనం ముందుకు రానుంది. దీనితో డబ్బులు అధికంగా వసూలు చేసే, అంబులెన్స్ సామ్రాజ్యానికి కొంత చెక్ పెట్టినట్లు చెప్పవచ్చు. మొత్తం మీద మహా ప్రస్థానం అంబులెన్స్ స్కీమ్ మంచిదేనంటున్నారు ఏపీ ప్రజలు.

Related News

Lokesh Vs Botsa: మా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Dasara Navaratri Celebrations: శ్రీ వేదమాత గాయత్రీ దేవిగా.. కనకదుర్గమ్మ దర్శనం

Vijayawada News: స్కూల్‌ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అదుపు తప్పిన బస్సు, విద్యార్థులు సేఫ్

Big Stories

×