Pushpa 3 Update:పుష్ప.. సినిమా కాదు ఒక సెన్సేషన్.. 2021లో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది. రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్గా సమంత(Samantha) తొలిసారి స్పెషల్ సాంగ్ చేసి ఆకట్టుకుంది. ఇక సునీల్, ఫహద్ ఫాజిల్, అనసూయ తదితరులు విలన్ పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమా సీక్వెల్ గా మూడేళ్ల పాటు నిర్విరామంగా కష్టపడి ‘పుష్ప 2’ సినిమాను ఈ ఏడాది విడుదల చేశారు. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమా ఏకంగా నెల కూడా పూర్తికాకముందే రూ.1600 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. రూ.2000 కోట్ల క్లబ్ లోకి చేరడానికి గట్టిగా ప్రయత్నం చేస్తోందని చెప్పవచ్చు. ఒకరకంగా సౌత్ ఇండస్ట్రీలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించకపోయినా.. బాలీవుడ్లో మాత్రం ఊహించని క్రేజ్ లభించింది. అంతేకాదు ఈ సినిమా దెబ్బకి అక్కడ నేరుగా విడుదలైన హిందీ చిత్రం ‘బేబీ జాన్’ సినిమా కూడా చతికిల పడిపోయిందని చెప్పవచ్చు.
పుష్ప 3 లో సూపర్ స్టార్ రజినీకాంత్..
ఇదిలా ఉండగా ‘పుష్ప3’ కూడా ఉంటుందని, ఇదివరకే క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప3 గురించి కూడా పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది? ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు? అని చాలా మంది బన్నీ అభిమానులు తమ అభిప్రాయాలను ప్రశ్న రూపంలో బయటపెడుతున్నారు. ఇక ఇదిలా ఉండగా మరొకవైపు పుష్ప3 సినిమాలో నటించబోయేది ఎవరు? అనే విషయంలో చాలా పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది పేర్లు బయటకు రాగా.. ఇప్పుడు సూపర్ స్టార్ పేరు కూడా బయటకు రావడం గమనార్హం. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) పేరు ప్రథమంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆయన ఒక కీలక పాత్రలో నటించబోతున్నారని వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ ఈ సినిమాలో నటిస్తే అటు తమిళ్, మలయాళం మార్కెట్లో కూడా ఈ సినిమా బాగా కలెక్షన్స్ వసూలు చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారట.
ఆ ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టిన సుకుమార్..
ఈ ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టడానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే పుష్ప 2 సినిమాకి భారీ కలెక్షన్లు రావడానికి కారణం నార్త్ ఇండస్ట్రీ మాత్రమే అని చెప్పాలి. సౌత్ లో అది కూడా మలయాళం , తమిళంలో పెద్దగా కలెక్షన్స్ వసూలు చేయలేదు. అందుకే ఈ రెండు ఇండస్ట్రీలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రజనీకాంత్ ను రంగంలోకి దింపబోతున్నారని, అందులోను రజనీకాంత్ కు పవర్ఫుల్ పాత్ర కేటాయించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మలయాళం, తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా ఊహించని కలెక్షన్స్ వసూలు చేస్తుందనడంలో సందేహం లేదు. కానీ దీనిపై మేకర్స్ నుంచీ క్లారిటీ రావాల్సి ఉంది.
రజనీకాంత్ తో పాటు విజయ్ దేవరకొండ కూడా..
ఇదిలా ఉండగా మరొకవైపు రజనీకాంత్ తో పాటు విజయ్ దేవరకొండ (Vijay deverakonda) పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. పుష్ప 2 క్లైమాక్స్ లో కనిపించింది విజయ్ దేవరకొండ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు వస్తున్న వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ పుష్ప3లో బన్నీతో పాటు ఎవరెవరు కనిపించబోతున్నారు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంచారు నిర్వాహకులు.