BigTV English
Advertisement

Manchu Vishnu: అసలు పెద్దమనిషి హాజరుకాలేదేంటో.. అంత పొగరా.. ?

Manchu Vishnu: అసలు పెద్దమనిషి హాజరుకాలేదేంటో.. అంత పొగరా.. ?

Manchu Vishnu: సాధారణంగా ఏ రంగంలో అయినా  ఒక పదవిలో ఉన్న వ్యక్తి.. తనకు ఇచ్చిన బాధ్యతలను ఎలాంటి సమయంలోనైనా నిర్వర్తించాలి. అది వారి బాధ్యత. ఆ పదవి రాకముందు నేను ఆ పనులు చేస్తాను.. ఈ పనులు చేస్తాను. ఇంతలా కష్టపడతాను అని చెప్పుకొచ్చి.. పదవి వచ్చాకా కనీసం వాటి వంక కన్నెత్తి కూడా చూడడం మానేస్తారు. ఇది కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే వర్తించదు. ఏ పదవిని అందుకున్నవారు అయినా ఇలాగే మారుతున్నారు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా ఇదే పని చేస్తున్నాడు అనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది.


గత కొన్ని రోజులుగా  ఇండస్ట్రీ ఎలాంటి సమస్యలను ఎదుర్కుంటుందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఒకపక్క లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఇంకోపక్క ఇండస్ట్రీలో గొడవలు..  సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది అన్నట్లుగా.. గత కొత్తకాలంగా సెలబ్రిటీలు అందరూ పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఇక ఈరోజు ఇండస్ట్రీలో సమస్యల గురించి సినీ పెద్దలు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం  తెల్సిందే.

“తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. గంజాయి, డ్రగ్స్ తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలి. ప్రభుత్వ కార్యక్రమాల్లో, రాష్ట్ర అభివృద్ధిలో ఇండస్ట్రీ కూడా భాగస్వామ్యం కావాలి” అని  రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. సినీ పెద్దలు సైతం తమ సమస్యలను సీఎం ముందు ఏకరువు పెట్టారు. ఇండస్ట్రీ పెద్ద FDC  చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో దాదాపు 36 మంది సెలబ్రిటీలు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు.


Jr NTR’s Dragon : తారక్ పాత్రను లీక్ చేసిన ప్రశాంత్ నీల్… మరీ ఇంత వైల్డ్ ఏంటి గురూ..

ఈ 36 మందిలో మా ప్రెసిడెంట్ మాత్రం లేడు. నిజం చెప్పాలంటే.. సీఎంతో భేటీ అంటే సినీ పెద్దలు  కన్నా ముందు మా ప్రెసిడెంట్ అయిన మంచు విష్ణునే ముందు ఉండాలి. సినిమాలో నటించే ప్రతి ఒక్కరికి మా సభ్యత్వం ఉండాలని అంత కచ్చితంగా చెప్పినప్పుడు.. వారి మంచి కోసం జరిగే ఈ మీటింగ్ లో విష్ణు లేకపోవడం ఏంటి.. ? అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సరే.. విష్ణు రాకపోవడానికి బలమైన కారణం  ఏమైనా ఉందా.. ? అని అంటే .. ఏది లేదు.

ప్రస్తుతం విష్ణు .. కన్నప్ప సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. అంటే ఇండస్ట్రీ సమస్యల కన్నా కన్నప్పనే ఎక్కువ అయ్యిందా.. ? లేక.. వారందరితో పాటు సీఎం ను నేను కలవడమేంటి అనే పొగరా.. ? పోనీ కుటుంబ విషయాలతో సతమతమవుతున్నాడు అనుకోవడానికి కూడా లేదుగా  అని మాట్లాడుకుంటున్నారు.

ఈ  మధ్య ప్రతి సెలబ్రిటీ.. ప్రభుత్వంపై సెటైర్లు వేయడం ట్రెండ్ అవ్వడం చేస్తున్నారు. అల్లు అర్జున్ కేసు విషయంలో మరింతగా విమర్శించారు. ఈరోజు  మీటింగ్ లో కూడా దీని గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి మాట్లాడడానికి కూడా విష్ణుకు తీరిక లేదు. ఈ మధ్యనే దాని గురించి ఒక పోస్ట్ పెట్టుకొచ్చాడు.

Dil Raju : సీఎంతో మీటింగ్… ఆ మూడు అంశాలేపైనే ఫోకస్ అంతా అంటున్న దిల్ రాజు

“ప్రభుత్వాల మద్దతుతోనే సినీ పరిశ్రమ ఎదిగింది. హైదరాబాదులో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడడానికి కారణం అప్పటి సీఎం చెన్నారెడ్డి ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. ప్రతి ప్రభుత్వంతో సినీ పరిశ్రమ సత్సంబంధాలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో మా సభ్యులను విన్నవించుకుంటున్నాను. దయచేసి సున్నితమైన విషయాలపైన మా సభ్యులు అసలు స్పందించకండి. సభ్యులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పకపోవడమే మంచిది.

ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మధ్యలో మనం స్పందించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ముఖ్యంగా ఇలాంటి అంశాల పైన స్పందించడం వల్ల సంబంధిత వ్యక్తులకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి మా సభ్యులకు ఐకమత్యం ఎంతో అవసరం” అంటూ చెప్పుకొచ్చాడు. అంతా బావుంది కానీ, ఇదేదో ఈరోజు మీటింగ్ కు వెళ్లి చెప్తే ఇంకా బావుండేది అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి మా ప్రెసిడెంట్ .. ఒక్కడే సీఎం ను కలిసి మాట్లాడతాడేమో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×