BigTV English

Chandrababu: తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు.. ఇది మంచి ప్రభుత్వం

Chandrababu: తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు.. ఇది మంచి ప్రభుత్వం

ప్రకాశం జిల్లా వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయంతో కలిపి మొత్తం తొలి విడతలో రూ.7వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు ప్రకటించారు. ఎంపిక చేసిన కొందరు రైతులకు చెక్ లు అందజేశారు. దేశవ్యాప్తంగా ఈ పథకం ఇదే రోజు అమలవుతుండగా.. వారణాసి నుంచి ప్రధాని మోదీ ప్రసంగాన్ని అక్కడున్న పెద్ద స్క్రీన్ పై ప్రదర్శించారు. రైతులతో కలసి ఆయన ప్రసంగం విన్నారు సీఎం చంద్రబాబు. అనంతరం రైతులతో మాట్లాడారు, ఇది మంచి ప్రభుత్వం అని, అన్నదాతలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయని, ఇక్కడే చాలామందికి మెసేజ్ లు వచ్చాయని చెబుతున్నారని, ఎవరికైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నెంబర్ లో సంప్రదించాలని సూచించారు చంద్రబాబు.


రైతులకు లాక్ డౌన్ లేదు..
ప్రపంచమంతా లాక్ డౌన్ కాలంలో ఇల్లు కదలకపోతే, రైతులు మాత్రం పొలానికి వెళ్లారని గుర్తు చేశారు. అన్నదాతలు కరోనాని సైతం లెక్క చేయకుండా పంటలు పండించారని అన్నారు. అలాంటి అన్నదాతలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. తాను డ్రిప్ ఇరిగేషన్ అమలు చేస్తే, వైసీపీ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశారన్నారు. దేశంలోనే తొలిసారి డ్రిప్ ఇరిగేషన్ ని మొదలు పెట్టింది తమ ప్రభుత్వమేనన్నారు. విధ్వంసకర పాలనలో ప్రజలు నరకం చూశారన్నారు. మళ్లీ మనకు మంచి రోజులు వచ్చాయని చెప్పారు చంద్రబాబు.

కొత్త బిచ్చగాళ్లు..
మహిళా సంఘాలు ఏర్పాటు చేసింది తానేనని, మహిళలకు అంత మేలు చేసినా కొన్నిసార్లు తనని మరచిపోయారన్నారు చంద్రబాబు. కొత్త బిచ్చగాళ్లు వస్తే, వారి మాయలో పడిపోయి గెలిపించారన్నారు. కొండనాలుకకు మందు వేస్తే, ఉన్న నాలుక ఊడిపోయిందని.. ఇప్పుడు తిరిగి కూటమిని గెలిపించి మంచి పని చేశారన్నారు. వైసీపీకి ఓటు వేయడం ద్వారా ఏపీ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిందని, తిరిగి ఇప్పుడిప్పుడే దాన్ని సరిదిద్దుతున్నామని చెప్పారు చంద్రబాబు.

నన్ను గుర్తు పెట్టుకోండి..
ఆగస్ట్ 15వతేదీ ఆడబిడ్డలందరూ రెడీగా ఉండండి, హుషారుగా ఉండండి అంటూ స్త్రీ శక్తి పథకం గురించి చెప్పారు సీఎం చంద్రబాబు. మహిళలు ఉచితంగా ఆర్టీసీలో బస్సుల్లో ప్రయాణించే పథకాన్ని ఆగస్ట్ 15న ప్రారంభిస్తామన్నారు. దీని ద్వారా ప్రతి రోజూ 2.60 కోట్లమందికి లబ్ధి జరుగుతుందన్నారు. రోజుకొక్కసారైనా నన్ను గుర్తు పెట్టుకోండి అని మహిళలకు సూచించారాయన. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి పెద్దలు ఇచ్చే ఆస్తి కంటే తానేఎక్కువ ఆర్థిక సాయం చేశానన్నారు. పెద్దలు ఇచ్చిన ఆస్తి కంటే, రెండు మూడు రెట్లు ఎక్కువ తానే ఇస్తున్నానన్నారు.

తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు..
సూపర్ సిక్స్ హామీలు అన్నీ ఒక్కొక్కటే అమలు చేస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు. తల్లికి వందనం విషయంలో గత ప్రభుత్వం మోసం చేసినా, తాము న్యాయం చేశామన్నారు. ఎన్నికల ముందు ఏమి చెప్పామో, అవన్నీ చేసి చూపిస్తున్నామన్నారు చంద్రబాబు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని, ఇది మంచి ప్రభుత్వం అని వివరించారు. మారుతన్న కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా రైతులు కూడా మారాలన్నారు. పంటల్లో వైవిధ్యం ఉండాలన్నారు. రైతులు నష్టపోకుండా చూసే బాధ్యత తమపై ఉందన్నారు చంద్రబాబు.

Related News

AP Liquor Case: లిక్కర్ కేసు.. విమానంలో నేతలు-బ్యూటీలు, జల్సాల గుట్టు బయట పెట్టిన ఆనం

Pulivendula Tensions: బైపోల్ వేళ పులివెందులలో టెన్షన్.. టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య దాడులు

AP Cabinet: చంద్రబాబు కేబినెట్ భేటీ, ఉచిత బస్సు, కొత్త బార్లపై ఫోకస్

Jagan On Ponnavolu: జగన్ సమక్షంలో ఏం జరిగింది? పొన్నవోలుపై రుసరుసలు

Handloom Sector: చేనేత రంగానికి ఏపీ బూస్ట్.. జీఎస్టీ భారం ప్రభుత్వానిదే

Super Six: సూపర్ సిక్స్ కి వైసీపీ ఉచిత ప్రచారం.. సాక్ష్యం ఇదే

Big Stories

×