Hyderabad Shocking: హైదారాబాద్ నగర ప్రజలకు షాకింగ్ న్యూస్. నగరంలోని ప్రజల్లో 84 శాతం మందికి లివర్ సంబంధిత వ్యాధుల ముప్పు ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా వెల్లడించారు. నగర ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఈ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నగరంలోని ప్రజల్లో 84 శాతం మందికి లివర్ సంబంధిత వ్యాధుల ముప్పు ఉందని ఆయన వెల్లడించిన వివరాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మద్యం సేవనం, వ్యాయామం కొరత వంటి అంశాలే ఈ పరిస్థితికి కారణమవుతున్నాయని మంత్రి వివరించారు.
ఇది కేవలం ఒక ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, ఇది వచ్చే పదేళ్లలో సమాజానికే భయంకరమైన ప్రభావాన్ని చూపే ముప్పు అని ఆయన హెచ్చరించారు. “ఎక్కువ మందికి లివర్ సమస్యను పట్టించుకోకుండా ఉంటే ప్రమాదకరం అన్నారు. ఒకసారి లివర్ దెబ్బతింటే తిరిగి మామూలుగా మార్చడం చాలా కష్టం” అని మంత్రి స్పష్టంచేశారు.
జీవనశైలిలో మార్పులు అవసరం
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తక్షణమే తమ జీవనశైలిలో మార్పులు తీసుకురావాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులు, రోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించడం, మద్యం నుంచి దూరంగా ఉండటం వంటి పద్ధతులు అనుసరించడం చాలా అవసరం. ప్రత్యేకించి యువత ఈ విషయాన్ని గమనించి అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి కోరారు.
ప్రస్తుతం హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో వేగంగా మారుతున్న జీవనశైలి, వర్క్ ప్రెషర్, సమయానికి తిండి తినకపోవడం, జంక్ ఫుడ్ వంటివి తినడం వల్ల ఈ సమస్యకు దారితీస్తున్నాయన్న అంశంపై వైద్య నిపుణులు కూడా ఇప్పటికే పలు సందర్భాల్లో హెచ్చరించారు. అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ఆ ఆందోళనకు మరో మలుపు చేర్చాయి.
అందువల్ల, ప్రజలు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచింది. చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహా తీసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే, ఆరోగ్యం ఒక్కసారి కోల్పోతే తిరిగి పొందడం కష్టం, ముఖ్యంగా లివర్ సంబంధిత వ్యాధుల విషయంలో అని మంత్రి తెలిపారు.