AP DSC 2025: ఏపీ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లపై ఫోకస్ చేసింది. ఇప్పటికే డీఎస్సీ పేరిట 16 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. అభ్యర్థుల మేరకు పలు మార్పులు-చేర్పులు చేసింది. తాజాగా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది ఆనందించారు. గడిచిన ఐదేళ్ల ఎలాంటి నోటిఫికేషన్ రావడంతో సంబరపడ్డారు. దరఖాస్తులు చేస్తున్నారు. తమవైపు చూడలేదంటూ పలువురు ఆటగాళ్లు మొరపెట్టుకున్నారు. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి రావడంతో వెంటనే అలర్ట్ అయ్యింది. స్పోర్ట్స్ విభాగంలో దాదాపు 421 పోస్టుల భర్తీకి ప్రకటన చేశారు మంత్రి రాం ప్రసాద్‌రెడ్డి.
టీచర్ ఉద్యోగాల్లోకి నేరుగా
డీఎస్సీతో సంబంధం లేకుండా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ కోసం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. అర్హత కలిగిన ఆటగాళ్లు నేరుగా మూడు శాతం రిజర్వేషన్ కల్పించింది. అయితే ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి పరీక్షలు ఉండవని స్పష్టం చేసింది. అర్హులకు నేరుగా ఉద్యోగాలు కల్పిస్తారు. సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసిన తర్వాత మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వనుంది.
ప్రభుత్వం జడ్పీ, ఎంపీ పాఠశాలల్లో 333 ఉద్యోగాలు ఉన్నాయి. మున్సిపాలిటీ-30, ఆశ్రమ పాఠశాలలు- 22, గురుకులాలు-2, మోడల్ స్కూళ్లు-4, సాంఘిక సంక్షేమ పాఠశాలు-7, గిరిజన సంక్షేమ పాఠశాలు-23 ఉన్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే 73 ఉద్యోగాలు కర్నూలు జిల్లాకు రానున్నాయి. ఆ తర్వాత చిత్తూరు జిల్లా ఉంది.
ALSO READ: పిలుపు ఓకే.. జగన్ వెళ్లడం ఖాయం?
కర్నూలుకే అధిక ఛాన్స్
జోన్ల వారీగా పరిశీలిస్తే జోన్-3, జోన్-4 ల్లో 11 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 15 వరకు ఉండనుంది. ఎంపిక ప్రక్రియ జులైలో ఉండనుంది. విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్-శాప్ కార్యాలయంలో మాట్లాడిన మంత్రి రాంప్రసాద్, జిల్లా ఎంపిక కమిటీ -DSC పరీక్షలలో క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు వెల్లడించారు.
స్పోర్ట్స్ కోటా కింద మెగా డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మే 2 నుండి మే 31 వరకు https://sports.ap.gov.in మరియు https://sportsdsc.apcfss.in వెబ్‌సైట్‌లలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు సదరు మంత్రి. సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 20న 16, 347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. అవికాకుండా మరో 421 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.