Gold Rates Today: బంగారం మంచిగా నిగనిగలాడుతుంటుంది. అంతే రేటు కూడా అలాగే ఉంటుంది. ప్రస్తుతం బంగారం రేటు బాగా పెరిగిపోయి పసిడి ప్రియులకు చాలా నిరాశను కలిపిస్తుంది. అంతర్జాతీయ పరిణామాలలో దేశీయ మార్కెట్‌లో ఆల్ టైమ్ గరిష్టానికి చేరిన బంగారం ధర గత కొన్ని రోజులుగా కాస్తా దిగొస్తోంది. నిన్న బుధవారం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 97,910 ఉండగా నేడు 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 95,730 కి తగ్గింది. అలాగే బుధవారం నాడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 89, 750 ఉండగా.. నేడు అనగా గురువారం కి 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 87, 750 కి తగ్గింది. పది రోజుల్లో పసిడి ధరలు దాదాపు రూ. 5 వేలు తగ్గింది.
అంటే నిన్నటి, నేటికి బంగారం ధర 10 గ్రాముల తులం బంగారం మీద రూ. 2,180 తగ్గింది. దీంతో పసిడి ప్రియులు మళ్లి ఆశలు పెంచుకుంటున్నారు. అటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధర కాస్త దిగొచ్చింది. అమెరికా-చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టడం, రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందానికి సంకేతాలు కన్పించడం, డాలర్‌కి వాల్యు పెరగడంతో బంగారం ధరలు తగ్గుతున్నట్లు చెబుతున్నారు.
Also Read: యూపీఐకి క్రెడిట్ కార్డ్ ఇలా లింక్ చేయండి..లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
బంగారం ధరలు కాస్తా తగ్గుతుండటంతో ప్రజలు కాస్తా ఊపిరి పీల్చుకుంటున్నారు. లక్షకు దాటిన బంగారం ధరలు విని ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో మళ్లి ఇప్పుడు బంగారం ధరలు కాస్తా తగ్గడంతో పసిడి ప్రియులు మళ్లి కొనడానికి ఆసక్తి చూపిస్తారు. బంగానం ధరలు తగ్గడం పసిడి కొనుగోలు చేయాలని భావించే వారికి ఊరట కలిగిస్తుంది. అది అలా ఉంటే కొందరు బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా? లేదంటే తగ్గినట్టే మళ్లి పెరుగుతాయా? అని ప్రశ్నిస్తున్నారు.. ఏది ఏమైనా బంగారం ధరులు ప్రస్తుతం తగ్గాయి. బంగారం కొనాలనుకునే వారు తొందరగా కొనగలిగితే వారి డబ్బులు ఆదా చేసినట్టు అవుతుంది. లేదంటే మళ్లి పెరిగాయంటే.. అప్పుడు కొనాలనుకున్నప్పుడు బంగారం ధరలకు సామాన్య ప్రజలు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది.. చూడండి మరి జాగ్రత్త..