AP Govt: ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఇదో తీపికబురు చెప్పింది కూటమి సర్కార్. ఖరీఫ్ పంట బీమా స్కీమ్ కోసం నిధులను విడుదల చేసింది. రైతులకు ఆర్థిక భద్రత, పంట నష్టాల నుంచి కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకుంది.
వర్షాకాలం సీజన్ మొదలు కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలపై దృష్టిపెట్టాయి. ఈసారి ముందుగా నైరుతి రుతుపవనాలు రావడం, వర్షాపాతం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో ప్రభుత్వాలు ముందుగా అలర్ట్ అవుతున్నాయి. తాజాగా అన్నదాతలకు శుభవార్త చెప్పింది కూటమి సర్కార్.
ఖరీఫ్ పంట బీమా స్కీమ్ కోసం దాదాపు 132 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. దీనివల్ల రైతులకు అనేక ప్రయోజనాలను ఉన్నాయని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ముఖ్యమైన అడుగని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని బయటపెట్టింది.
కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన-PMFBY కింద వీటిని విడుదల చేసింది. ఈ పథకం ద్వారా రైతులకు పంట నష్టం జరిగినప్పుడు ఆర్థిక సహాయాన్ని అందించనుంది. 2008 నుంచి గ్రామం ఇన్సూరెన్స్ యూనిట్‌గా పరిగణించే ఈ పద్దతి అమలులో ఉంది. దీనివల్ల చిన్న ప్రాంతాల్లో పంట నష్టం జరిగితే అన్నదాతలకు పరిహారం అందుతుంది.
ALSO READ: ఉద్యోగిని అర్ధనగ్నంగా సంకెళ్లతో స్తంభానికి కట్టేసి, పెట్రోల్ పంప్ మేనేజర్ దాష్టీకం
అంతేకాకుండా ఈ పథకం ద్వారా పంటలకు సహజ విపత్తులు, తెగుళ్లు, ఇతర కారణాల వల్ల నష్టపోయినప్పుడు లబ్ది చేకూరనుంది. ఈ పథకం వల్ల రైతులు నెక్ట్స్ సీజన్‌లో రుణం తీసుకునే అర్హత సైతం కల్పిస్తుంది. ఈ నిధులతో లక్షలాది మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు.
ఈ పథకం కోసం రైతులు దరఖాస్తు చేసుకోవడం చాలా సులువు. దగ్గరలోని వ్యవసాయ శాఖ ఆఫీసుకు రైతులు వెళ్లాలి. ఆన్‌లైన్‌లో PMFBY పోర్టల్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, భూమి సంబంధిత పత్రాలు, బ్యాంకు అకౌంట్ వివరాల్ని సమర్పించాల్సి ఉంటుంది.
పంటల వివరాలు, ఎన్ని ఎకరాల అనేది, ఇన్సూరెన్స్ చేయాలనుకుంటున్న మొత్తం అందులో స్పష్టంగా నింపాలి. రైతులు స్వచ్ఛందంగా ఇందులో పాల్గొనవచ్చు, బ్యాంకుల నుంచి లోన్ తీసుకోని రైతులు ఇందులో చేరవచ్చు.
అన్నదాతలకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం, ఖరీఫ్ పంట బీమా పథకాలకు రూ.132.58 కోట్లు విడుదల చేసింది.#FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/JfGkDPxQQU
— Telugu Desam Party (@JaiTDP) May 31, 2025