AP : కడప, చీరాల, మాచర్ల. ఒక్క దెబ్బకు మూడు వికెట్లు డౌన్. కూటమి ప్రభుత్వం గురి చూసి కొట్టింది. టైమ్ చూసి దెబ్బేసింది. వైసీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా షాక్ ఇచ్చింది. అవినీతి, అవిశ్వాసం, దుర్వినియోగం ఆరోపణలతో ముగ్గురి పదవులను ఊస్ట్ చేసింది.
కడప మేయర్‌పై వేటు
కడప మేయర్ సురేష్ బాబుకు ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. అవినీతి ఆరోపణలతో ఆయనపై అనర్హత వేటు వేసింది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టాలను ఉల్లంఘించినట్టు విచారణలో తేలడంతో పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంది. కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ పనులు అప్పగించిన అంశంపై మేయర్‌పై ఫిర్యాదులు వచ్చాయి. మంగళవారం మేయర్‌ను మున్సిపల్ సెక్రటరీ విచారించారు. సురేశ్‌బాబు రెండు వారాలు గడువు కోరారు. మేయర్ వివరణపై సంతృప్తి చెందని మున్సిపల్ శాఖ.. సురేశ్‌బాబును పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
తురకా కిశోర్ అవుట్
మరోవైపు, పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ తురకా కిశోర్‌పైనా వేటు పడింది. కిశోర్‌ను ఛైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. పదవి దుర్వినియోగం, పురపాలక చట్టాల ఉల్లంఘన కారణాలతో ఆయన్ను డిస్మిస్ చేశారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా వరుసగా 15 సార్లు కౌన్సిల్ మీటింగ్స్‌కు డుమ్మా కొట్టారు కిశోర్. ఆ కారణంతో సెక్షన్ 16(1) ప్రకారం ఆయన్ను మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. తురకా కిశోర్ గతంలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమా కారుపై కర్రలతో దాడి చేశారు. ఆ తర్వాతే ఆయన్ను వైసీపీ మరింత ఎంకరేజ్ చేసింది. కిశోర్‌కు మున్సిపల్ ఛైర్మన్ పదవి కట్టబెట్టింది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ప్రధాన అనుచరుడిగా ఉంటూ మాచర్ల ఏరియాలో ఆధిపత్యం చెలాయించారు. కట్ చేస్తే.. కూటమి సర్కారు వచ్చినప్పటి నుంచి తురకా కిశోర్ కనిపించకుండా పోయారు. ఇప్పుడాయన మున్సిపల్ ఛైర్మన్ పదవి సైతం పోయింది. త్వరలోనే ఆయన్ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం కూడా జరుగుతోంది.
టీడీపీ ఖాతాలో చీరాల..
కడప, మాచర్లతో పాటు చీరాలలోనూ వైసీపీకి షాక్ తగిలింది. చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. టీడీపీ ఖాతాలో మరో మున్సిపాలిటీ చేరింది. నో కాన్ఫిడెన్స్ ప్రతిపాదనపై ఆమంచి వర్గంతో కలిపి మొత్తం 26 మంది కౌన్సిలర్లు ఓటు వేశారు. వైసీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ జైసన్ బాబుపై కూడా టీడీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. జైసన్ బాబుకు వ్యతిరేకంగా 27 మంది ఓటు వేశారు. త్వరలోనే కొత్త ఛైర్మన్ ఎన్నిక ఉండనుంది.
Also Read : ఏపీ బీజేపీలోకి జకియా ఖానం.. ఏం మెసేజ్ ఇచ్చినట్టు?