BigTV English

Pastor Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ డెత్.. ఇవిగో ప్రూఫ్స్.. తేల్చి చెప్పిన ఐజీ

Pastor Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ డెత్.. ఇవిగో ప్రూఫ్స్.. తేల్చి చెప్పిన ఐజీ

సాక్షుల విచారణ, టెక్నికల్ ఎవిడెన్స్‌, పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత.. ప్రమాదంలో చనిపోయినట్లు తేల్చామన్నారు ఐజీ. ప్రవీణ్‌ది హత్య అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారన్నారు ఐజీ. హత్యకు గురైనట్లు ఆధారాలు లేవన్నారు ప్రవీణ్‌ కాల్‌ లిస్ట్‌ మొత్తం తీశామన్నారు.

ప్రవీణ్ దారి మధ్యలో వైన్ షాపు దగ్గర ఆగారు. అక్కడ చేసిన నగదు లావాదేవీల వివరాలు సేకరించామని ఐజీ పేర్కొన్నారు. దారి మధ్యలో మూడు సార్లు ప్రవీణ్ పడిపోయారని తెలిపారు. ప్రవీణ్ డ్రంక్ అండ్ డ్రైవ్ స్టేజ్‌లో వాహనం నడిపారని తేల్చి చెప్పారు. లిక్కర్ షాపులో పేమెంట్స్‌కు సంబంధించి టైం మ్యాచ్ అయిందని వెల్లడించారు. ప్రమాదం జరగడానికి ముందు ప్రవీణ్ వాహనం వెనుక కారు దూరంగానే ఉందని.. సీసీ ఫుటేజ్‌పై CFSL రిపోర్టు తీసుకున్నామని ఐజీ పేర్కొన్నారు. ప్రమాదం జరగడానికి రోడ్డుపైన ఉన్న కంకర రాళ్లు కూడా కారణం అని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు బండి వేగం 70 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్టు ఫోరెనిక్స్ రిపోర్టు ఆధారంగా తేలిందని ఐజీ వెల్లడించారు.


ఆల్కాహాల్‌తో డ్రైవింగ్ చేస్తూ.. యాక్సిండెంట్‌లో చనిపోయారని రిపోర్ట్‌లు చెబుతున్నాయని ఐజీ తెలిపారు. రోడ్డు మీద పడినప్పుడూ వేగంగా వెళ్లి ఒక బలమైన ఆబ్జెక్టును ఢీ కొట్టి, ఎగిరిపడి స్పాట్ లోనే చనిపోయారు. బాగా ఎండ, కంటిన్యూ జర్నీ చేయడం కూడా ఒక కారణం కావచ్చని ఐజీ చెప్పారు. మొదట ప్రమాదం జరిగినప్పుడే ఆగిపోకుండా ముందుకెళ్లారని తెలిపారు. ప్రవీణ్ బయలు దేరినప్పటి నుంచి ప్రమాదం జరిగే వరకు అన్నీ సీసీ పుటేజ్‌లు సేకరించామని ఐజీ పేర్కొన్నారు. పాస్టర్ ప్రవీణ్ బైబిల్ కాలేజ్ కోసం రాజమండ్రి వచ్చారు. మర్డర్, అనుమానాస్పద మృతి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ప్రవీణ్ రాక గురించి ముగ్గురికి మాత్రమే తెలుసని ఐజీ పేర్కొన్నారు. ప్రవీణ్ మృతిపై ఆరోపణలు చేస్తున్న ఎవరూ.. పదిరోజులు టైమ్ ఇచ్చినా తమకు ఆధారాలు ఇవ్వలేదని తెలిపారు.

Also Read: పిల్లల అల్లరి భరించలేం.. పోలీసులకు కంప్లైంట్? హెడ్‌మాస్టర్ లెటర్ వైరల్

గత మూడు నెలలుగా ఎవరెవరితో మాట్లాడారన్నది గుర్తించి వారందరినీ విచారించినట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లే సమయంలో ఆరుగురితో మాత్రమే మాట్లాడారని, వారిని ప్రశ్నించినట్లు తెలిపారు. ఇటు సోషల్‌ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేసిన వారందరికీ ఆధారాలు ఇవ్వాలని సమయం ఇచ్చినా, ఇవ్వలేదన్నారు.

Related News

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

AP Rain Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువే!

AP new bar policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. ఇకపై మందుబాబులకు అక్కడ కూడా కిక్కే!

Big Stories

×