Big Stories

AP Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. సచివాలయాల్లో 1896 పోస్టులు.. అర్హతలివే

AP Jobs: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రామ సచివాలయాల్లో 1896 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పశుసంవర్థక సహాయకుల నియామక ప్రకటన ప్రకారం.. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు కావలసిన అర్హతల వివరాలను వెల్లడించింది.

- Advertisement -

డైరీ సైన్స్, డైరీయింగ్, పౌల్ట్రీసైన్స్, వెటరినరీ సైన్స్ అనుబంధ సబ్జెక్టుల్లో ఒకేషనల్ ఇంటర్మీడియట్, డిప్లమో, బీఎస్సీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత ఉండాలి. అర్హుల వయసు జులై 1, 2023 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీ వర్గాలకు 5 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వర్గాలకు పదేళ్ల చొప్పున గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.

- Advertisement -

ఎంపిక విధానం ఇలా..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తొలుత రాతపరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా జిల్లాల వారిగా జాబితా విడుదల చేసి, ఎంపిక కమిటీల ఆధ్వర్యంలో తుది జాబితా రూపొందించి నియామకాలను ఖరారు చేస్తారు.

అభ్యర్థులు రాతపరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా.. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నిర్వహించే ఎంపిక ప్రక్రియలో మెరిట్ జాబితాలో ఉన్నవారిని సెలెక్ట్ చేస్తారు. సెలెక్టైన అభ్యర్థులకు రూ.22,460 నుంచి రూ.72,810 వరకూ జీతాన్ని చెల్లిస్తారు.

దరఖాస్తు చేసుకోవాలనుకున్నవారు https://apaha-recruitment.aponline.in/ ను సందర్శించాలి. డిసెంబర్ 11లోగా దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 27 నుంచీ హాల్ టికెట్లను జారీ చేస్తారు. డిసెంబర్ 31న రాత పరీక్ష నిర్వహిస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News