BigTV English

AP Liquor Merchants: మందుబాబులకేమో ఫుల్ కిక్కు.. మా పరిస్థితి ఏంటి? మా వల్ల కాదు.. ఏపీ మద్యం వ్యాపారులు

AP Liquor Merchants: మందుబాబులకేమో ఫుల్ కిక్కు.. మా పరిస్థితి ఏంటి? మా వల్ల కాదు.. ఏపీ మద్యం వ్యాపారులు

AP Liquor Merchants: మందుబాబులకు ఫుల్ కిక్కు సరే.. మా సంగతేంటి.. ఏదో అనుకున్నాం.. ఏదేదో జరుగుతోంది. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయించి గతంలో లాభపడ్డారు కొందరు. ఇప్పుడేమో ఆ పరిస్థితి లేదు. మందుబాబులకు ఉన్న కిక్కు.. తమ బిజినెస్ లో లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మద్యం వ్యాపారస్తులు. తమ బాధ నేరుగా సీఎస్ కు లేఖ రూపంలో వివరించారంటే, ఏపీలో మద్యం వ్యాపారుల పరిస్థితి ఎలా ఉందో ఇట్టే చెప్పవచ్చు.


ఏపీలో మద్యం పాలసీ ప్రారంభమై నెల కాలేదు కానీ, అప్పుడే కుయ్యో మొర్రో అంటున్నారట మద్యం వ్యాపారులు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నూతన మద్యం పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. మొత్తం 3396 మద్యం దుకాణాలకు టెండర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించి, లాటరీ పద్ధతిన వ్యాపారస్తులకు ఆయా దుకాణాలు కేటాయించారు. ఇక మద్యం షాపులు దక్కించుకున్న వారు, శుభమా అంటూ తమ వ్యాపారాలను ప్రారంభించారు. మందుబాబులకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగానే, రూ.99 లకే క్వార్టర్ బాటిల్ కూడా అందుబాటులోకి తెచ్చారు. అలాగే మద్యం బ్రాండ్స్ కూడా మారగా, ఇక మందుబాబులు రెచ్చిపోయారు. ఇలా కొద్ది రోజులు వ్యాపారం బాగా సాగింది. ఇక్కడే మద్యం షాపులు దక్కించుకున్న వారికి షాక్ తగిలిందట.

నూతన మద్యం విధానం ప్రవేశపెట్టిన సమయంలో వ్యాపారస్తులకు 20 శాతం కమిషన్ అందజేస్తామని ప్రభుత్వం తెలిపినట్లు మద్యం వ్యాపారులు తెలుపుతున్నారు. అయితే బీర్ల కొనుగోళ్లపై 8 శాతం, సాధారణ మద్యం బాటిళ్లపై 10 శాతం, అధిక రేటు గల బ్రాండ్లపై కాస్త ఎక్కువగా కమిషన్ అందుతోందట వ్యాపారస్తులకు. ఇలా చేస్తే తమకు వచ్చే ఆదాయం, కేవలం షాపుల మెయింటెనెన్స్ కే సరిపోతుందని, ఇక తమకు ఏంటి లాభం అంటూ మద్యం దుకాణాల అసోసియేషన్ ఏకంగా సీఎస్ కు లేఖ రాశారు.


ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారని, గత ప్రభుత్వ హయాంలో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు సాగాయి కాబట్టే లాభాలు వచ్చినట్లు వారు తెలుపుతున్నారు. అంతేకాదు ప్రభుత్వం ముందు తెలిపినట్లుగా, తమకు స్టాక్ తీసుకొనే సమయంలోనే 20 శాతం ట్రేడ్ మార్జిన్ ఇవ్వాలని, లేకుంటే నష్టపోతూ వ్యాపారం చేసే స్థితిలో తాము లేమని వ్యాపారస్తులు కరాఖండిగా చెప్పేస్తున్నారట.

Also Read: YSR Family: విజయమ్మ నోటి మాట.. ఇక అంతా సైలెంట్ అయ్యేనా? బాలినేని చెప్పిందే నిజమైందా?

ఇప్పటికే లేఖ రాసిన మద్యం షాపు యజమానులు, ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రకటన వస్తుందోనన్న రీతిలో ఎదురుచూపుల్లో ఉన్నారు. మరి మందుబాబులకు ఫుల్ కిక్కు అందించిన ప్రభుత్వం, తమ బిజినెస్ గురించి కూడా ఆలోచించాలని మద్యం షాపులు దక్కించుకున్నవారు కోరుతున్నారు. అలాగే ప్రభుత్వం త్వరగా నిర్ణయం వెల్లడించకుంటే మందు బాబులకు షాకిచ్చేందుకు వ్యాపారులు రెడీ అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×