Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కి హైకోర్టులో తాజాగా ఊరట లభించింది. అసలు విషయంలోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల సమయంలో నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్.. వైసిపి అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి (Ravi Chandra Kishor Reddy) ని సతీ సమేతంగా కలిసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో అల్లు అర్జున్ ను చూడడానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేశారు అంటూ అప్పట్లో అల్లు అర్జున్ పై కేస్ నమోదయింది.
హైకోర్టులో అల్లు అర్జున్ కు భారీ ఊరట..
అసలు విషయంలోకి వెళితే.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని నంద్యాల పోలీసులు అల్లు అర్జున్ పై సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 ఉల్లంఘన నేపథ్యంలో కేసు వేశారు. అయితే తాజాగా అల్లు అర్జున్ తనపై వేసిన కేసు కొట్టి వేయాలి అని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. అల్లు అర్జున్ పై ఉన్న కేసును హైకోర్టు కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు.. ఇప్పుడు కేసు కొట్టి వేయడంతో అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ అభిమానులకు మింగుడు పడడం లేదా..
ఇకపోతే ఈ విషయం అల్లు అర్జున్ అభిమానులకు సంతోషాన్నిస్తుంటే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరిగిన సమయంలో అల్లు అర్జున్ మేనమామ పవన్ కళ్యాణ్ కూటమి తరఫున పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సినీ పెద్దలందరూ పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచారు.. కానీ అల్లు అర్జున్ మాత్రం వైసిపి నేత ఎమ్మెల్యే అభ్యర్థికి సపోర్టు చేయడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి తోడు పవన్ కళ్యాణ్ కు ఎందుకు మద్దతు పలకలేదో క్లారిటీ ఇవ్వాలని పలువురు జబర్దస్త్ కమెడియన్లు కూడా పెద్ద ఎత్తున బహిరంగ సభలలో అల్లు అర్జున్ ని కించపరుస్తూ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే అవి ఏవి పట్టించుకోని అల్లు అర్జున్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయారు.. ఇక ఇప్పుడు కేసు నుంచి కూడా విముక్తి కలగడంతో ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ సినిమాలు..
ఈ అల్లు అర్జున్ సినిమాలో విషయానికి వస్తే.. గతంలో అల్లు అర్జున్ సుకుమార్ (Sukumar)కాంబినేషన్లో వచ్చిన పుష్ప(Pushpa ) సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ ‘ పుష్ప -2 ‘ డిసెంబర్ ఐదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో రూ.1000 కోట్లు దాటేసిన ఈ సినిమా ఖచ్చితంగా ఇప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేస్తుందంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ కి ఈ మధ్య బాగా కలిసొస్తుందని సినీవర్గాలు కామెంట్లు చేస్తున్నాయి.