Ramayan Release Date: రామాయణ ఇతిహాసాన్ని ఇప్పటికీ ఎంతోమంది దర్శకులు ఎన్నో రకాలుగా చెప్పారు. అయినా తరువాతి తరం దర్శకులు కూడా ఈ కథను కొత్తగా చెప్పడానికి ప్లాన్ చేస్తూనే ఉన్నారు. అలాగే బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ కూడా ‘రామాయణ్’ను కొత్తగా చూపించడానికి సిద్ధమయ్యింది. నితేష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో రామాయణం తెరకెక్కుతుంది అన్నదానికంటే ఇందులో స్టార్ క్యాస్టింగ్ వల్లే సినిమాకు విపరీతమైన హైప్ వచ్చింది. ఇప్పటికీ ఈ మూవీ నుండి ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు. కానీ ఉన్నట్టుండి సైలెంట్‌గా ‘రామాయణ్’ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చారు మేకర్స్.
క్లారిటీ వచ్చేసింది
‘రామాయణ్’ (Ramayan) లో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) రాముడిగా, సాయి పల్లవి (Sai Pallavi) సీతగా కనిపించనుంది. కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) రావణాసురిడి పాత్రలో నటించనున్నాడు. ఇప్పటివరకు ఈ స్టార్ క్యాస్టింగ్ గురించి వివరాలు బయటికొచ్చినా దీని గురించి కూడా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను అందించలేదు మూవీ టీమ్. ఇంతలోనే దీనికి సంబంధించిన రిలీజ్ డేట్ బయటికి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పైగా ఈ ‘రామాయణ్’ను ఒక్క పార్ట్‌లో కాకుండా రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్టుగా కూడా మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించుకొని సెట్స్ నుండి ఫోటోలు లీక్ అయినా కూడా ‘రామాయణ్’ ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్లు సమయం పడుతుందని స్పష్టం చేశారు.
Also Read: డంకి చిత్ర యూనిట్ కి క్షమాపణలు చెప్పిన ప్రశాంత్ నీల్
రెండేళ్లు ఆగాల్సిందే
‘రామాయణ్’ ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్లు కావాలి. 2025 దీపావళికి ‘రామాయణ్ పార్ట్ 1’ విడుదల కానుండగా పార్ట్ 1 విడుదలయిన సరిగ్గా ఏడాది తర్వాత అంటే 2027 దీపావళికి పార్ట్ 2 విడుదల అవుతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఒక స్పెషల్ పోస్టర్‌తో ఈ రిలీజ్ డేట్స్ గురించి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇందులో నటీనటులు పేరు గానీ, మరే ఇతర వివరాలు గానీ లేవు. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ్’ను నమిత్ మల్హోత్రా నిర్మించనున్నారని మాత్రమే పోస్టర్‌లో తెలిపారు. నమిత్ మల్హోత్రా బాలీవుడ్‌లోనే కాదు.. హాలీవుడ్‌లో కూడా ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించి తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకున్నారు.
దశాబ్దం కల
నిర్మాత నమిత్ మల్హోత్రా (Namit Malhotra) స్వయంగా ‘రామాయణ్’ రిలీజ్ డేట్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ‘5000 ఏళ్ల క్రితం జరిగిన ఒక ఇతిహాస కథ ఎన్నో వందల ఏళ్లగా ప్రేక్షకుల మనసుల్లో ఒక ప్రత్యేమైన స్థానాన్ని సంపాదించుకుంది. దీనిని తెరపైకి తీసుకురావాలని దాదాపుగా దశాబ్దం నుండి కలలు కంటున్నాను. ఇప్పుడు అది కార్యరూపం దాల్చడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా టీమ్ అంతా ఇలాంటి ఒక పవిత్రమైన కథను ప్రేక్షకులకు అందంగా అందించడం కోసమే కష్టపడుతున్నారు. మన రామాయణాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు అందించనున్నాం’’ అంటూ ‘రామాయణ్’ నిర్మాణంలో భాగమవ్వడం సంతోషంగా ఉందని వ్యాఖ్యలు చేశారు నమిత్ మల్హోత్రా.
MASSIVE DEVELOPMENT… 'RAMAYANA' PART 1 & 2 RELEASE DATE ANNOUNCEMENT… Mark your calendars… #NamitMalhotra's #Ramayana – starring #RanbirKapoor – arrives in *theatres* on #Diwali 2026 and 2027.
Part 1: #Diwali2026
Part 2: #Diwali2027
Directed by #NiteshTiwari. pic.twitter.com/3BRWR0bg2L— taran adarsh (@taran_adarsh) November 6, 2024