AP Liquor case updates: ఏపీలో వచ్చేవారం కీలక పరిణామం చోటు చేసుకోనుందా? కీలక నేత ఒకరు అరెస్టు కాబోతున్నారా? దీనికి సంబంధించిన ఫార్మాలిటీస్‌ను కూటమి సర్కార్ పూర్తి చేసిందా? అరెస్టుకు మానసికంగా సిద్థమయ్యారా? పార్టీని ఆ విధంగా రెడీ చేస్తున్నారా? ఇంతకీ వచ్చేవారం ఎవరు అరెస్టు కాబోతున్నారు? అనే చర్చ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం ఏపీలో ట్రెండింగ్ సబ్జెక్ట్ మద్యం కుంభకోణ కేసు. వైసీపీ హాయంలో వేల కోట్ల స్కామ్ జరిగిందని చెబుతోంది కూటమి సర్కార్. జగన్‌కు కోర్ టీమ్‌గా ఉండేవాళ్లంతా ఇప్పటికే అరెస్టు అయ్యారు. ఇక మిగిలింది ఆయనే అన్న చర్చ లేకపోలేదు. దీనిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రచ్చ సాగుతోంది.
జరుగుతున్న పరిణామాలను ఆ పార్టీ నేతలు, కేడర్ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ కేసులో 128 మంది సాక్షుల నుంచి విచారణ చేపట్టింది సిట్. అలాగే 74 హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకుంది. లిక్కర్ కేసుకు సంబంధించి కర్మ, కర్త, క్రియ ఎవరు అనేది అధికారులు ఓ అంచనాకు వచ్చేశారు. కాకపోతే ఎవరైనా అప్రూవర్‌గా కేసు మరింత బలంగా తయారు అవుతుందని భావిస్తున్నారు.
ఇప్పటివరకు అరెస్టయిన వారంతా ఎవరికివారు తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందరూ చెప్పే పాయింట్ ఒక్కటే. తాడేపల్లి ప్యాలెస్ అని అన్నట్లు వార్తలు వస్తున్నాయి. మాజీ సీఎంను అరెస్టు చేయడం అనేది చట్టపరంగా అత్యంత సున్నితమైన అంశం. దీన్ని గమనించిన కూటమి ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ALSO READ: టార్గెట్ వాళ్లే.. అరెస్టు కాకుంటే పేలుళ్లే?
గతవారం గవర్నర్, హైకోర్టు సీజేలను కలిశారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా లిక్కర్ వివరాలు చెప్పారనే ప్రచారం లేకపోలేదు. గురువారం ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీతో భేటీ సమయంలో ఆయా విషయాలు చెబుతున్నారనే ప్రచారం లేకపోలేదు.
ఈ వారం ప్రధానితో భేటీ అయిన మంత్రి లోకేష్ జరుగుతున్న పరిణామాలు వివరించాని అంటున్నారు. మిగతా పని ముఖ్యమంత్రిని చేస్తారని అంటున్నారు. కేబినెట్ సమావేశంలో లిక్కర్ కేసుపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని చెప్పారట సీఎం. ఇదంతా నాణెనికి ఒకవైపు మాత్రమే.
మరోవైపు పార్టీని బలోపేతం చేయడంపై జగన్ ఫోకస్ చేశారు. ఎప్పుడూ లేని విధంగా పార్టీని పునర్ నిర్మించే పనిలోపడ్డారట అధినేత. ఇటీవల కాలంలో వైసీపీ ఆఫీసులో వరుసగా జరుగుతున్న సమావేశాలు అందులో భాగమేనని అంటున్నారు.
కేడర్ నుంచి లీడర్ల వరకు దిశా నిర్ధేశం, అధికార వికేంద్రీకరణ, జిల్లాలో మీరే నిర్ణయాలు తీసుకోవాలంటూ అధ్యక్షులకు పూర్తి స్వేచ్చ ఇవ్వడం వెనుక కారణం ఇదేని అంటున్నారు. ఒకవేళ అరెస్టు అయితే కేడర్ చెదిరిపోకుండా ఉండేలా చర్యలు చేపట్టారన్నది కొందరు నేతల మాట.
ఈసారి అధినేత అరెస్టయితే బయటకు రావడం కష్టమని అంటున్నారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని భావించి ఈడీ రంగంలోకి దిగేసింది. గడిచిన 15 ఏళ్లతో పొల్చితే ఈడీ విభాగం బలంగా ఉందని అంటున్నారు. మొత్తానికి వచ్చేవారంలో ఊహించని పరిణామం జరగడం ఖాయమన్నమాట.