Rajinikanthసౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) తాజాగా నటిస్తున్న చిత్రం కూలీ(Coolie).. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు అన్ని ఏరియాలలో భారీ డిమాండ్ ఏర్పడింది. లోకేష్ కనగరాజు (Lokesh Kanagaraju) దర్శకత్వంలో రాబోతుండడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇకపోతే ‘జైలర్’ సినిమాతో సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఊహించని విజయం లభించింది. దీంతో ఇప్పుడు ‘కూలీ’ సినిమాకి తెలుగులో కూడా బజ్ ఏర్పడింది. దీనికి తోడు ఇందులో నాగార్జున (Nagarjuna ) కీలక పాత్రలో కనిపించనుండడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీగా నిర్మిస్తూ ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా తెలుగు హక్కుల కోసం తెలుగు బడా నిర్మాతలు పోటీపడుతున్నట్లు సమాచారం.
కూలీ తెలుగు రైట్స్ కోసం నిర్మాతలు పోటీ..
అసలు విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ లో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న దిల్ రాజు, సూర్యదేవర నాగ వంశీ, సునీల్ నారంగ్ వంటి బడా నిర్మాతలు ఈ సినిమా తెలుగు హక్కుల కోసం పోటీ పడుతున్నారట. అంతేకాదు ఈ మూవీకి ఇప్పటివరకు రూ.42 కోట్ల వరకు ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదే రోజున బాలీవుడ్లో ఎన్టీఆర్(NTR )- హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటిస్తున్న చిత్రం వార్ -2 కూడా విడుదల అవుతుండడంతో ఇది బాక్స్ ఆఫీస్ యుద్ధం అంటూ నెటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటివరకు రూ.42 కోట్ల వరకు ఆఫర్ అందుకున్న ఈ సినిమా మరి తెలుగు రైట్స్ ఎన్ని కోట్లకు అమ్ముడుపోతాయో చూడాలి.
ఆయన వల్లే భారీ డిమాండ్..
ఇక తెలుగులో జైలర్ (Jailer ) సినిమాకి ఉన్న క్రేజ్ విషయానికి వస్తే.. ఈ సినిమా హక్కులను ఏషియన్ ఫిలిమ్స్ కేవలం రూ.12 కోట్లకు మాత్రమే దక్కించుకుంది. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dileep Kumar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగులో రూ.86 కోట్ల గ్రాస్, రూ.48 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. దీంతో రజిని సినిమాకి ఇప్పుడు తెలుగులో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఇకపోతే జైలర్ తర్వాత వచ్చిన ‘లాల్ సలాం’ డిజాస్టర్ గా నిలిచిన ‘వేట్టయాన్’ సినిమా మాత్రం పర్వాలేదు అనిపించుకుంటుంది. కానీ ఇప్పుడు లోకేష్ కనగరాజు దర్శకత్వం కావడంతోనే డిమాండ్ భారీగా ఏర్పడింది. లోకేష్ ఇప్పటివరకు తెలుగులో మూవీ చేయకపోయినా ఆయన సినిమాలకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అటు అక్కినేని నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు దీంతో ఈ సినిమా హక్కులు కొనుగోలు చేయడంపై తెలుగు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు తెలుగులో ఈ సినిమాను నాగార్జున అన్నపూర్ణ స్టూడియో ద్వారా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. మరి కూలీ సినిమా హక్కులు ఎవరికి సొంతం అవుతాయో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.
ALSO READ:Kayadu Lohar: డ్రాగన్ బ్యూటీపై కేస్ ఫైల్.. ఈడీ విచారణలో విస్తుపోయే నిజాలు.. !