BigTV English

Minister Roja: పవన్ తో పాటు బండ్ల గణేష్ పై రోజా సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

Minister Roja: పవన్ తో పాటు బండ్ల గణేష్ పై రోజా సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

Minister Roja Counter to Bandla Ganesh


Roja Counter to Bandla Ganesh(Latest political news in Andhra Pradesh): విశాఖలో ఆధ్యాత్మిక టూరిజం వాహనాలను పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించేలా ఏపీటీడీసీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో పాటుగా బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యల మీద  రియాక్టయ్యారు. 7’O క్లాక్ బ్లేడ్ తో కోసుకొని చస్తానన్న వారికి సొంతంగా ఎదిగే మహిళలంటే చులకన అని కౌంటర్లు వేశారు. తాడేపల్లిగూడెంలో జెండా సభలో జగన్ ను అంధ: పాతాళనికి తొక్కుతానంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి రోజా మండిపడ్డారు. చంద్రబాబు దగ్గర ఊడిగం చూస్తూ పాతాళానికి వెళ్లింది పవన్ కళ్యాణే అంటూ కౌంటర్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఎన్నాళ్లు అయ్యిందని రోజా ప్రశ్నించారు. కనీసం ఒక్క ఎన్నికల్లోనైనా గెలిచారా అంటూ ప్రశ్నించారు. బూత్ లెవల్ కమిటీలు మనకు ఉన్నాయా అంటూ జనసేన నేతలను, కార్యకర్తలపై మండిపడడం సిగ్గుచేటని అన్నారు. పార్టీ నిర్మాణాన్ని గాలికి వదిలేసి చంద్రబాబు చుట్టూ తిరుగుతూ ఇప్పుడు పార్టీ కేడర్ ను తప్పు పట్టడం ఏంటని ప్రశ్నించారు. పవన్ రెండు చోట్ల ఓడిపోవడం సిగ్గు చేటు కాదా..? అని ప్రశ్నించారు.


మరో వైపు రుషికొండలో వరల్డ్ క్లాస్ టూరిజం భవనాలను నిర్మించామన్న మంత్రి రోజా.. అందులో సీఎం క్యాంప్ కార్యాలయం ఉంటే బాగుంటుందని త్రిసభ్య కమిటీ సూచించిందన్నారు. సీఎం జగన్ అంగీకరిస్తే అది సీఎం క్యాంపు కార్యాలయం అవుతుందన్నారు. లేకపోతే పర్యాటక భవనాలుగా ఉంటాయని చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్ మీద రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలకు రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బండ్ల గణేష్ ఎవ్వరంటూ ప్రశ్నించిన మంత్రి రోజా.. 7 గంటలకు బ్లేడుతో కోసుకొని చస్తానన్న వారు తన గురించి మాట్లాడడమా.. అంటూ మండిపడ్డారు. స్వశక్తితో ఎదుగుతున్న మహిళలను నీచంగా మాట్లాడడం ఆయన నైజం అంటూ తీవ్ర వ్యాఖ్యలుచేషశారు.

Read More: వైసీపీ 8వ లిస్ట్.. 2 ఎంపీ, 3 ఎమ్మెల్యే ఇన్‌ఛార్జ్‌ల ప్రకటన

అయితే బండ్ల గణేష్ ఇటీవల మంత్రి రోజాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని రోజా యాక్సడెంటల్ సీఎం అని అభివర్ణించడంతో ఆమెపై బండ్ల గణేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోజా డైమండ్ రాణి అని.. ఏపీ ఎన్నికల్లో ఈ సారి ఆమెకు సీటు వస్తుందో రాదో తెలియదు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం కాదనీ.. జగనే యాక్సిడెంటల్ సీఎం అని విమర్శించారు.

రేవంత్ రెడ్డిని ఫైటర్ గా బండ్ల గణేష్ అభివర్ణించారు. రేవంత్ రెడ్డి తనను తానుగా కష్టపడి ప్రూవ్ చేసుకొని సీఎం అయ్యారన్నారు. నాన్నా చనిపోతేనో.. తండ్రి వారసత్వంతోనో ముఖ్యమంత్రి అయితే యాక్సిడెంటల్ సీఎం అంటారన్నారు. ఇక పులుసు వండిపెట్టింది కాబట్టి రోజా పులుసు పాప అయ్యిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేష్. ఎన్నికల్లో ఓడిపోతే జబర్దస్త్ ప్రోగ్రామ్ చేసుకోవాలంటూ సెటైర్లు వేశారాయన. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ వ్యాఖ్యలపై రోజా కౌంటర్ ఇచ్చారు.

 

Related News

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Big Stories

×