BigTV English

Vaddepalli Srinivas passed away: సినీ పరిశ్రమలో మరో విషాదం.. గబ్బర్ సింగ్ సింగర్ కన్నుమూత..

Vaddepalli Srinivas passed away: సినీ పరిశ్రమలో మరో విషాదం..  గబ్బర్ సింగ్ సింగర్ కన్నుమూత..
Advertisement

Folk Singer Vaddepalli Srinivas Passed away


Folk Singer Vaddepalli Srinivas Passed away: ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ ఇకలేరు. గురువారం ఉదయం హైదరాబాద్ లో కన్నుమూశారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. వడ్డేపల్లి శ్రీనివాస్ మరణవార్తను ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు.

కొన్నాళ్లుగా వడ్డేపల్లి శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మృతి సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శ్రీనివాస్ మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటని పలువురు సినీప్రముఖులు సంతాపం ప్రకటించారు.


Read More: క్యాన్సర్‌తో మాజీ మిస్ ఇండియా మృతి

వడ్డేపల్లి శ్రీనివాస్ జానపద గాయకుడిగానూ ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి తన ప్రతిభను చాటుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లోనూ పాటలు పాడే అవకాశం అందుకున్నారు. 2012లో వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్ సినిమా శ్రీనివాస్ ను గాయకుడిగా మరో మైలురాయికి చేర్చింది. ఈ సినిమాలో గన్నులాంటి పిల్ల.. పాటతో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆ పాటకి శ్రీనివాస్ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు.

ఆ తర్వాత ఆయన కెరీర్ లో చాలా అవకాశాలు అందుకున్నారు. మొత్తంగా 100పైగా సినిమా పాటలు పాడారు. ప్రైవేట్ గా ఎన్నో గీతాలు ఆలపించారు. ఫోక్ గాయకుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జానపద గీతాలే ఆయనలో గాయకుడిని ప్రపంచానికి బాగా పరిచయం చేశాయి.

Related News

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Big Stories

×