BigTV English

Anantapur News: ఆ ఐదుగురు బాలికలకు గోల్డెన్ ఛాన్స్.. విమానంలో ప్రయాణించే అవకాశం

Anantapur News: ఆ ఐదుగురు బాలికలకు గోల్డెన్ ఛాన్స్.. విమానంలో ప్రయాణించే అవకాశం

Anantapur News: సాధించాలనే పట్టుదల ఉండేలాగానీ సాధించలేదని ఏదీ లేదు. ఎప్పుడో నాలుగు దశాబ్దాల కిందట ఎనిమిదో తరగతి టెస్టు బుక్‌‌లో ‘దుర్గాచరణుడు’ పేరిట ఒక పాఠం ఉండేది. ఆ పాఠం ఏమోగానీ.. పైన కనిపిస్తున్న ఐదుగురు అమ్మాయి అనుకున్నది సాధించారు. విమానంలో ఉచితంగా ప్రయాణించే ఛాన్స్ కొట్టేశారు. అసలు స్టోరీ ఏంటి?


టెన్త్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు విమానంలో ట్రావెల్ చేయిస్తానని ఓ ఎంఈవో మాట ఇచ్చారు. అన్నమాట ప్రకారం హామీని నిలబెట్టు కున్నారు. అనంతపురం జిల్లా బెళుగుప్ప ప్రాంతానికి ఎంఈవో మల్లారెడ్డి. పదో తరగతిలో 550 మార్కులు సాధించిన ఐదుగురు బాలికలకు బెంగళూరు నుండి హైదరాబాద్‌కు విమానంలో తీసుకెళ్లి పర్యాటక ప్రాంతాలను చూపించనున్నారు. విద్యార్థుల ఈ టూర్ కు సంబంధించిన ఖర్చును తాను భరిస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.

అనంతలో ఏ మండలం?


అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల విద్యాధికారి మల్లారెడ్డి ప్రభుత్వం పాఠశాల విద్యార్థుకు ఒక ఆఫర్ ఇచ్చారు. ఈసారి పదో తరగతి పరీక్షల్లో ఎవరైతే 550 మార్కులు సాధిస్తారో వారికి విమానంలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తానని అన్నారు. బెళుగుప్ప మండలంలో ఈశ్వరి, మధుశ్రీ, అర్చన, ఇందు, లావణ్య అనే ఐదుగురు అమ్మాయిలు 550 కన్నా ఎక్కువ మార్కుల సాధించారు.

ఆ బాలికలను విమానంలో తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. బాలికలతో కలిసి జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారులను ఎంఈవో కలిశారు. వారి అనుమతి తీసుకున్నారు. తొలుత బెళుగుప్ప నుంచి బెంగళూరుకు వెళ్తారు. అక్కడి ఎయిర్‌పోర్ట్‌ నుంచి విద్యార్థినులతో కలిసి విమానంలో హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. భాగ్యనగరంలో పర్యాటక ప్రదేశాలను వారికి చూపించనున్నారు.

ALSO READ: పవన్ మార్క్, గౌరవ వేతనంతో చక్కని అవకాశం

ఆ అమ్మాయిలకు గోల్డెన్ ఛాన్స్

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకుంటారని తమ మండలం విద్యార్థినులు నిరూపించారని అన్నారు మల్లారెడ్డి. విద్యార్థులు బాగా చదివేందుకు ప్రోత్సహిస్తే మంచి మార్కులు వస్తాయని నిరూపించారు ఆయన. బెళుగుప్ప ఎంఈవో మల్లారెడ్డి లాంటివారు తమకు కూడా ఉంటే బాగుండేదని మరి కొందరు విద్యార్థులు అంటున్నారు.

విమానంలో ప్రయాణం ఒకటైతే, హైదరాబాద్‌లో పర్యాటక ప్రాంతాలను చూసే అదృష్టం ఆ విద్యార్థులకు దక్కిందని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల పిల్లలు అయితే బస్సులు లేదంటే రైలులో ప్రయాణం చేస్తారు. అలాంటి ఈ లక్ష్మీపుత్రులు ఏకంగా విమానంలో ప్రయాణం చేసే అవకాశం దక్కించుకున్నారని అంటున్నారు.

ఏపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన టెన్త్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు రాణించారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా 590కి పైగా మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు. పల్నాడు జిల్లాలో పావని చంద్రిక 598 మార్కులు సాధించింది. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిగా చంద్రిక గుర్తింపు తెచ్చుకుంది. చంద్రికకు హిందీ, ఇంగ్లీష్‌లో 99 మార్కులు వచ్చాయి. మిగతా సబ్జెక్టుల్లో నూటికి నూరు మార్కులు వచ్చాయి. కాకినాడకి చెందిన నేహాంజనికి 600కు 600 మార్కులు సాధించింది. కాకపోతే బాలిక ప్రైవేట్ స్కూల్‌లో ఈ ఘనత సాధించింది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×