AP NGOS huge donation: ఏపీలో వరదలు విలయతాండవం సృష్టించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వం కోల్పోయి బాధితులు బోరున విలపిస్తున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. అయితే, ఈ క్రమంలో ఏపీకి భారీగా విరాళాల వెల్లువెత్తున్నది. సినిమా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు ఇస్తున్నారు. తాజాగా ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కూడా భారీ విరాళాన్ని ప్రకటించారు. ఉద్యోగుల సెప్టెంబర్ నెల జీతంలో ఒక రోజు బేసిక్ పే ద్వారా రూ. 120 కోట్లను సీఎం సహాయనిధికి విరాళం ఇవ్వనున్నట్లు వారు ప్రకటించారు. పెన్షనర్లు కూడా ఈ విరాళంలో భాగమైనట్లు వారు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అంగీకార పత్రాన్ని జేఏసీ నేతలు సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు. వరద సహాయం నిమిత్తం విరాళం ఇచ్చినవారిలో మొత్తం 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు.
Also Read: ఎట్టకేలకు స్పందించిన కేంద్రం.. ఏపీకి రానున్న నిపుణుల బృందం