BigTV English

Deputy CM Pawan Kalyan: క్యూ ఆర్ కోడ్‌తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ కు సలహాలు..

Deputy CM Pawan Kalyan: క్యూ ఆర్ కోడ్‌తో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ కు సలహాలు..
Advertisement

Suggestions to Deputy CM Pawan Kalyan with QR Code: ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాపాలనలో వినూత్న మార్పులు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో ప్రజల వద్దకే వెళ్లి మరి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఏపీలోని గ్రామాల రూపు రేఖలు మార్చాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణ నీటి సరఫరా వంటి శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ తరుణంలో ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.


తాను చేపట్టిన శాఖలపై పవన్ కళ్యాణ్ ప్రజల సలహాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ తరుణంలో సూచనలు ఇవ్వాలనుకునే వారు క్యూఆర్ కోడ్, గూగుల్ ఫామ్ ద్వారా పంపవచ్చని పేర్కొన్నారు. దీని కోసం గూగుల్ ఫాం లింక్ https://forms.gle/8Y3rRtY1dewPQAyH7 ఇచ్చారు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి సలహాలు రాసి పంపాలని కోరారు.

ఈ మేరకు జనసేన ప్రకటన విడుదల చేసింది. క్యూఆర్ కోడ్, లింక్స్ కు సంబంధించిన వివరాలు ఎక్స్ ద్వారా షేర్ చేసింది. గూగుల్ ఫాంలో నింపాల్సిన వివరాలు కూడా పేర్కొంది. పేరు, ఫోన్ నెంబర్ సహా సలహాలు, సూచనలు పేర్కొనాలని వివరించింది. అంతేకాదు ఇందులో ఏ జిల్లా అనేది కూడా వివరాలు తెలిపి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏ శాఖలకు సూచనలు, సలహాలు ఇవ్వాలని అనుకుంటే ఆ శాఖ పేరుతో వివరంగా తమకు తోచిన సలహాలు ఇవ్వవచ్చని తెలిపింది. దీంతో పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ పనికి ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది.


Also Read: AP High Court orders status quo: వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టు స్టేటస్ కో

Tags

Related News

AP Heavy Rains: ఈ నెల 21నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు

CM Chandrababu: దీపావళి వేళ మరో గుడ్‌న్యూస్ చెప్పిన.. ఏపీ సీఎం చంద్రబాబు

Jogi Ramesh: నన్ను జైలుకు పంపాలని టార్గెట్.. బాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు

Target Pavan: టార్గెట్ పవన్.. జనసేనను బలహీన పరిచే కుట్ర..!

Nara Lokesh Australia Visit: ఏపీ క్లస్టర్‌లలో ఆస్ట్రేలియా పెట్టుబడుల కోసం.. మంత్రి లోకేష్ విజ్ఞప్తి

Digital Arrest Scam: ఎమ్మెల్యేకే బురిడీ..! రూ.1.07 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

Heavy Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. మళ్లీ వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు అలర్ట్..!

Modi Lokesh: బాబు తర్వాత లోకేషే.. మోదీ ఆశీర్వాదం లభించినట్టేనా?

Big Stories

×