Rapa Rapa Poster Row: పల్నాటి పంతాలు మళ్లీ రాజుకుంటున్నాయ్. జగన్ రెంటపాళ్ల పర్యటన తర్వాత కథ మళ్లీ మొదటికే వచ్చింది. హింసాత్మక రాజకీయాలవైపు ఏపీ పాలిటిక్స్ వెళ్తున్నాయా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. రప్పా రప్పా నరుకుతాం.. కొట్టండి.. నరకండి.. చంపండి.. వార్ డిక్లేర్ ఇలాంటి నేచర్ కార్యకర్తల్లో పెరుగుతోంది. ఎలక్షన్లకు ఇంకా చాలా టైమ్ ఉంది. అయినా సరే పొలిటికల్ హీట్ ఇప్పటి నుంచే ఎందుకు పెరుగుతోంది? కథ ఎక్కడ మొదలైంది?
రప్పా రప్పా ఫ్లెక్సీతో హైవోల్టేజ్ డైలాగ్ వార్
ఒక్క సినిమా డైలాగ్.. ఒకే ఒక్క సినిమా డైలాగ్.. ఏపీ రాజకీయాలను షేక్ చేసినంత పని చేసింది. YS జగన్ రెంటపాళ్ల పర్యటనలో ఓ కార్యకర్త పట్టుకున్న ఈ రప్పా రప్పా ఫ్లెక్సీ కాస్తా.. హైవోల్టేజ్ డైలాగ్ వార్ కు దారి తీసింది. సీఎం చంద్రబాబు, విపక్ష నేత జగన్ ఇద్దరూ రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. ఈ రప్పా రప్పా ప్లకార్డ్ పట్టుకోవడం వెనుక ఎవరికీ తెలియని సీక్రెట్ ఒకటి ఉంది. ఇంతకీ ఏంటది?
హింసను ప్రేరేపించేలా ప్లకార్డులు
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో జగన్ పర్యటన సందర్భంగా ప్రదర్శించిన ప్లకార్డులు వివాదాస్పదంగా మారాయి. ఒక్కసారి ఈ ప్లకార్డ్ చూడండి.. “2029లో వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం” అని ఒకటి.. మరొకటి చూడండి.. “వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు”..ఇంకోటి చూడండి.. “అన్న వస్తాడు, అంతు చూస్తాడు” అంటూ హైలెట్ చేశారు. అసలే పల్నాటి రాజకీయం నివురుగప్పిన నిప్పులా ఉంటుంది. కొంచెం అంటుకుందా.. ఇక పల్నాటి పంతాల సంగతి చెప్పక్కర్లేదు. అంతా హింసాత్మకమే.
హార్డ్ కోర్ క్యాడర్.. దేనికైనా రెడీనా?
రప్పా రప్పా అన్న సినిమా డైలాగ్ కాస్తా ఏపీలో పొలిటికల్ వైల్డ్ ఫైర్ గా మారిపోయింది. ఏపీలో రాజకీయం అందరూ అనుకున్నంత స్మూత్ గా ఉండదు. ఓవైపు టీడీపీ, ఇంకోవైపు వైసీపీ.. హార్డ్ కోర్ క్యాడర్ దేనికైనా రెడీ అన్నట్లుగానే ఉంటారు. పంతాలు, పట్టింపులు ఎక్కువ. అందులో భాగంగానే ఈ ప్లకార్డులు. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ రప్పా రప్పా ప్లకార్డ్ పట్టుకున్న ఈ వ్యక్తి పేరు రవితేజ. ఈయన ఏ పార్టీకి ఒరిజినల్ కార్యకర్త అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే మావాడు కాదంటే మావాడు కాదు అని రెండు పార్టీల మధ్య డైలాగ్స్ పేలుతున్నాయ్. ఇటీవలే టీడీపీ సభ్యత్వం కూడా తీసుకున్నాడని వైసీపీ.. కాదు కాదు 5 లక్షల బీమా కోసమే టీడీపీలోకి వచ్చాడని, అతడి మనసంతా వైసీపీయే అని టీడీపీ అంటోంది. సో ఇక్కడ మరో కీలకమైన విషయం ఉంది.
మిగితా వారిని ఉద్రేక పరిచేలా ప్లకార్డ్ మ్యాటర్
ప్లకార్డులో ఉన్న మ్యాటర్ హింసను ప్రేరేపించేలా ఉంది. కార్యకర్తలను ఉద్రేక పరిచేలా ఉంది. ఎవరైనా వీటికి నిజంగానే ఓవర్ రియాక్ట్ అయితే పరిణామాలు మరోలా ఉంటాయ్. సో ఎవరైనా ఇలాంటి పదాలు వాడొద్దని వీటిని ఖండించాలి. కానీ వైసీపీ నుంచి అలా జరగలేదు. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ రియాక్ట్ అయిన తీరు మరీ ఆశ్చర్యకరం అంటున్నారు. వారించాల్సింది పోయి వెనకేసుకు రావడం ఏంటన్నదే అసలు ప్రశ్న. ఓసారి జగన్ ఏమన్నారో చూడండి.
టీడీపీని నరుకుతా అంటున్నాడంటే మంచిదేగా- జగన్
రైట్ చూశారుగా మ్యాటర్. టీడీపీ వాళ్లను గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్లు రప్పారప్పా నరుకుతా అంటున్నాడంటే మంచిదే కదా అన్నారు. వాళ్ల కార్యకర్తే వైసీపీ అభిమానిగా మారి.. ఇప్పుడు టీడీపీ వాళ్లను నరుకుతా అంటున్నాడంటే మంచిదే కదా అని జగన్ కామెంట్స్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సినిమా డైలాగులు పెట్టినా తప్పే, ఫొటోలు పెట్టినా తప్పేనా అని క్వశ్చన్ చేశారు. టీడీపీనే రప్పారప్పా కోసేస్తానని అంటున్నాడంటే నిజంగానే పథకాలు రావట్లేదన్న బాధ ఉందేమో కదా అని కూడా అన్నారు. ఇక్కడ అందరూ ఎక్స్ పెక్ట్ చేసిందేంటంటే.. రాజకీయాల్లో డైలాగ్ వార్ కామనే గానీ.. ఇలా చంపుకోవడాలు, నరుక్కోవడాలు అనడం కరెక్ట్ కాదు అని చెబుతారనుకున్నారు. కానీ అలా జరగలేదు. వెనకేసురావడంతో ఒక్కసారి పొలిటికల్ వైల్డ్ ఫైర్ షురువైంది.
నిజ జీవితంలోనూ చంపేస్తారా అని సీఎం కౌంటర్
సీఎం చంద్రబాబు కూడా ఇదే ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. రీల్ లైఫ్ డైలాగ్ లకు, రియల్ లైఫ్ డైలాగ్ లకు తేడా ఉండక్కర్లేదా అని క్వశ్చన్ చేశారు. రప్పా రప్పా నరుకుతా.. అనేది సినిమా డైలాగ్ అని జగన్ చెబుతున్నారని, సినిమా డైలాగులు చెప్పడం కూడా తప్పేనా అని ప్రశ్నిస్తున్నారని, అయితే సినిమాల్లో మనుషులను చంపేస్తారు. అలాగని నిజజీవితంలోనూ చంపేస్తారా.. చంపేసి తప్పేంటని అంటారా..? ఇలాంటి వాళ్లకు ఏం చెప్తామన్నారు చంద్రబాబు.
వెనకేసురావడంతో పొలిటికల్ వైల్డ్ ఫైర్ షురూ
సో రౌడీయిజం, హింసను ప్రేరేపించేలా జగన్ పరామర్శ యాత్రలు ఉన్నాయన్నది టీడీపీ వాదన. పరామర్శల పేరుతో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారని, ఇలా భయాందోళనలు సృష్టిస్తామంటే కుదరదని గట్టిగానే సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇస్తున్నారు.
నువ్వా నేనా.. తేల్చుకుందాం.. ఇలాంటివి రాజకీయాల్లో కామన్ డైలాగ్ లు
నువ్వా నేనా.. తేల్చుకుందాం.. ఇలాంటివి రాజకీయాల్లో కామన్ డైలాగ్ లు. అయితే ఇవి డైలాగ్ లకే పరిమితం అవుతాయి. కానీ అవి లైన్ దాటితే చాలా ప్రమాదం. ఇప్పుడు వైసీపీ నేతల వరుస డైలాగ్ లు కూడా డేంజర్ జోన్ లోకి వెళ్తున్నాయన్న చర్చ జరుగుతోంది. తప్పులు జరుగుతున్నా ఖండించకపోవడం, ఎదురు ప్రశ్నించడం ఇవేంటని టీడీపీ నిలదీస్తోంది.
చట్టం తన పని తాను చేసుకెళ్తుందన్న చంద్రబాబు
జగన్ లాంటివారు రోడ్డుమీదకు వస్తే మున్ముందు ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అధికారం కోసం ఇంకా భయంకరంగా వ్యవహరిస్తారు. ఇదీ సీఎం చంద్రబాబు అంటున్న మాట. కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుందని అంటున్నారు. మొన్నటికి మొన్న రాజధాని మహిళలపై చేసిన కామెంట్లు జరిగిన రగడ అంతా ఇంతా కాదు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి వైసీపీకే డ్యామేజ్ చేస్తోందా.. అస్త్రాలు బూమరాంగ్ అవుతున్నాయా అన్న చర్చ జరుగుతోంది.
అమరావతిపై ఇప్పటికే వైసీపీ చాలా డ్యామేజ్
అమరావతిపై ఇప్పటికే పార్టీకి చాలా డ్యామేజ్ అయింది. అరెస్టులు జరిగాయ్. ఇది తప్పు అని వెంటనే ఖండించలేని పరిస్థితి. దీంతో మ్యాటర్ మరోలా డైవర్ట్ అయింది. వైసీపీకే డ్యామేజ్ అయ్యేలా మారింది. అప్పటికే అమరావతిలో మహిళలు, రైతులు, టీడీపీ శ్రేణులు నిరసనలు కూడా చేశాయి. తప్పును తప్పు అని చెబితే ఎలాంటి సమస్య ఉండదు. కానీ అలా జరగకపోతేనే అన్ని సమస్యలు వస్తాయి. అమరావతిపై వైసీపీ మొదటి నుంచి పూర్తి డైలమాలో ఉంది. వీటికి తోడు మొన్నటి కామెంట్స్ మొదటికే నష్టం చేశాయి. 2019 ఎన్నికలకు ముందు రాజధానిలో ఇల్లు కట్టుకుంటానని, అమరావతికే తమ మద్దతు అంటూ ప్రకటించిన వైఎస్ జగన్ గెలిచాక మాట మార్చడం, మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తేవడం, అమరావతి నిర్మాణ పనులను పట్టించుకోకపోవడంతో చాలా డ్యామేజ్ జరిగింది. తమ ఓటమికి అమరావతి కూడా ఒక కారణమే స్వయంగా వైసీపీ నేతలే అంగీకరించిన పరిస్థితి.
తమ కార్యకర్తలు తిరగబడితే పరిస్థితి ఏంటన్న టీడీపీ
ఇప్పుడు అసలు టాపిక్ ఏంటంటే.. అడ్డుకోవాల్సింది పోయి సమర్థించడం ఏంటన్న పాయింట్ ను కూటమి పార్టీల నేతలు వినిపిస్తున్నారు. తమ కార్యకర్తలు తిరగబడితే పరిస్థితి ఏంటని టీడీపీ క్వశ్చన్ చేస్తోంది.
కార్యకర్తను మందలించకుండా సమర్థిస్తారా? – భానుప్రకాశ్ రెడ్డి
మాజీ సీఎం జగన్ ఓదార్పు యాత్రపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఫైరయ్యారు. రప్పా రప్పా నరుకుతామంటూ ఫ్లెక్సీ పెట్టిన కార్యకర్తను మందలించకుండా సమర్థిస్తారా అని కౌంటర్ ఇచ్చారు. రాజకీయాలంటే ఆదర్శంగా ఉండాలని, జగన్ కు మాత్రం రాజకీయాలంటే అరాచకమే అంటున్నారు. రాష్ట్రంలోకి వస్తున్న లక్షల కోట్ల పెట్టుబడులు, అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారనిపిస్తోందన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. యుద్ధం ప్రకటించడానికి, రప్పా రప్పా నరకడానికి ఇది సినిమా కాదని, ప్రజాస్వామ్యమన్నారు. ఎవరిని నరుకుతారు.. ప్రజలనా ప్రజాస్వామ్యాన్నా.. అని ఫైర్ అయ్యారు.
జగన్ పార్టీ ఇప్పటికైనా స్ట్రాటజీ మార్చుకుంటుందా?
సో ఒక మాట అంటే పది కౌంటర్ డైలాగులు వైసీపీపై పడుతున్నాయి. దీంతో ఆ పార్టీకే డ్యామేజ్ పెరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా జగన్ పార్టీ స్ట్రాటజీ మార్చుకుంటుందా లేదంటే ఇదే పద్ధతి ఫాలో అవుతారా అన్నది చర్చనీయాంశమవుతోంది.
Story By Vidya Sagar, Bigtv Live