BigTV English
Advertisement

Akkineni Akhil : అఖిల్ అక్కినేని పెళ్లి డేట్ ఫిక్స్.. పెళ్లి వేదిక ఎక్కడంటే..?

Akkineni Akhil : అఖిల్ అక్కినేని పెళ్లి డేట్ ఫిక్స్.. పెళ్లి వేదిక ఎక్కడంటే..?

Akkineni Akhil : టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అక్కినేని వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇప్పటివరకు ఈ హీరో ఎన్ని సినిమాలు చేసిన సరైన హిట్ టాక్ ను అందుకోలేదు. ప్రస్తుతం లెనిన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక అఖిల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. దుబాయ్ కు చెందిన ఓ వ్యాపార వేత్త కూతురు జైనాబ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికి ట్రెండ్ అవుతున్నాయి. అయితే త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంలోకి వెళ్ళబోతున్నారు.. ఈ పెళ్లి ఎప్పుడు? ఎక్కడ జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం..


అఖిల్, జైనాబ్ ల పెళ్లి డేట్ ఫిక్స్..?

కొద్దినెలల క్రితం ఓ కార్యక్రమంలో అఖిల్ – జైనాబ్ కలుసుకోగా వీరి పరిచయం, ప్రేమగా మారింది. గుట్టుగా తమ ప్రేమాయాణాన్ని సాగించిన వీరిద్దరూ గతేడాది పెద్దల అంగీకారంతో సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చారు.. డిసెంబర్ లో నాగ చైతన్య, శోబిత ల పెళ్లి జరిగింది. అందుకే అఖిల్ పెళ్లిని కొద్ది నెలలు వాయిదా వేశారు. ఇప్పుడు పెళ్లి సమయం వచ్చేసింది. ఈ మధ్యనే పెళ్లి డేట్ ను ముహూర్తం ఫిక్స్ చేశారు. జూన్ 6న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో అఖిల్ అక్కినేని – జైనాబ్ రవ్జీల వివాహం జరగనుందట. అయితే దీనిపై అక్కినేని, జైనాబ్ కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాలి. గతంలో అఖిల్ కు ఓ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ ఏమైందో తెలియదు కానీ పెళ్లి పీటలు వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత కెరీర్ పై ఫోకస్ పెట్టిన అఖిల్ ఇన్నాళ్లకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.


Also Read : మంచు విష్ణు పరువు తీసేసిన నిర్మాత.. పుసుక్కున అంత మాట అన్నాడేంటి..?

హీరోగా నిలదొక్కుకోబోతున్న నిఖిల్.. 

అక్కినేని అఖిల్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. 2014లో అక్కినేని కుటుంబం మొత్తం కలిసి నటించిన మనంలో గెస్ట్ రోల్ పోషించారు. అనంతరం 2015లో వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌కు తొలి సినిమానే షాకిచ్చింది. హాలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, ఏజెంట్ చిత్రాల్లో నటించారు. వీటిలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌తో హిట్ అందుకున్నారు. కెరీర్‌ను హిట్ ట్రాక్‌లోకి ఎక్కించడానికి తెగ కష్ట పడుతున్నాడు. ప్రస్తుతం లెనిన్ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.. మరి ఈ మూవీ అయిన హిట్ అవుతుందేమో చూద్దాం.. ఏది ఏమైన పెళ్లి తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోతుందేమో చూడాలి.. అటు నాగ చైతన్య పెళ్లి తర్వాత తండేల్ మూవీతో హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలకు సైన్ చేశాడు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×