Vijayasai Reddy: ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు జోరందుకుంది. ఈ కేసులో కింగ్ పిన్‌గా వ్యవహరించిన కసిరెడ్డి ఇళ్లు, ఆఫీసులపై రెండురోజులు సోదాలు చేసింది సిట్. తాజాగా మరో కొత్త పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఈనెల 18న విచారణకు హాజరు కావాలని అందులో ప్రస్తావించింది. దీంతో వైసీపీ కీలక నేతల వెన్నులో వణుకు మొదలైంది.
దూకుడు పెంచిన సిట్
వైసీపీ కీలక నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది లిక్కర్ స్కామ్ దర్యాప్తు. ఈ కేసులో సిట్‌కు ఎలాంటి ఆధారాలు లభించాయో తెలీదుగానీ దూకుడుగా వెళ్తోంది. ఈ క్రమంలో సోమవారం ఆరేడు గంటలపాటు పాటు మాజీ సీఎం జగన్ బంధువు, ఆనాటి ఐటీ సలహాదారుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇల్లు, ఆఫీసులు, బంధువులు, స్నేహితులు ఇళ్లపై హైదరాబాద్‌లో దాదాపు 15 చోట్ల సోదాలు చేసింది. మంగళవారం కూడా కంటిన్యూ అయ్యాయి.
ఈ సోదాల్లో అధికారులకు కీలక పత్రాలు లభించినట్టు అంతర్గత సమాచారం. ఈ నేపథ్యంలో మరో అడుగు వేసింది సిట్. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చింది సిట్. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో సాక్షిగా విచారణకు రావాలని, వాంగ్మూలం నమోదు చేస్తామని ప్రస్తావించింది.
సాక్షిగా వీఎస్ఆర్‌కు పిలుపు
ఏప్రిల్ 18న (శుక్రవారం) ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ప్రస్తావించింది. వైసీపీ హయాంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. డిస్టలరీకు సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. తొలుత ఈ కేసును సీఐడీ దర్యాప్తు చేసింది. చివరకు సిట్ కు అప్పగించింది.
ALSO READ: జైలులో గోరంట్లకు రాజభోగాలు.. తలలు పట్టుకుంటున్న అధికారులు
కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్‌లో సూత్రధారి కసిరెడ్డి అని ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో తన దగ్గర ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. ఒకవేళ విచారణకు పిలిస్తే వెళ్లి తన దగ్గరున్న ఆధారాలను అధికారులకు అందజేస్తానని మీడియాకు చెప్పారు. ఆయన ఇచ్చిన సమాచారంతో దూకుడు పెంచింది సిట్.
వీఎస్ఆర్‌కు నోటీసులు ఇవ్వగానే వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. వీఎస్ఆర్ విచారణకు హాజరయితే ఇంకెవరి మెడకు చుట్టుకుంటుందోనన్న టెన్షన్ కీలక నేతలు వెంటాడుతున్నాయి. ఈ కేసులో పలువురు సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్న విషయం తెల్సిందే. ఏం చెయ్యాలో తెలియక కీలక నేతలకు అంతుబట్టడం లేదు. విజయసాయిరెడ్డి విచారణ తర్వాత ఇంకెవరికి పిలుపు వస్తుందో చూడాలి.
విజయసాయిరెడ్డికి మరో షాక్..
లిక్కర్ స్కామ్ లో నోటీసులు ఇచ్చిన సిట్
ఈ నెల 18న విచారణకు రావాలంటూ నోటీసులు
విజయవాడ సీపీ ఆఫీసులో దర్యాప్తుకు హాజరు కావాలని ఆదేశాలు pic.twitter.com/eLOZnz7kl4
— BIG TV Breaking News (@bigtvtelugu) April 15, 2025