Sugarcane Juice: వేసవిలో ఉపశమనం కోసం చెరకు రసం తాగుతుంటారు.. దీని వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చెరకు రసం తాగితే షుగర్ వ్యాధి వస్తుందేమోనని చాలామంది భయపడుతుంటారు. అలాగే ఇతర సమస్యలు కూడా రావచ్చని అపోహలు ఉంటాయి. ఒకవేళ మీకూ అలాంటి అపోహాలు ఉంటే, వాటిని మెదడు నుంచి తొలగించేయండి. ఎందుకంటే.. ఈ చెరకు రసం వల్ల ప్రయోజనాలే తప్ప నష్టాలేమి ఉండవని చెప్తున్నారు.
తక్షణ శక్తి:
చెరుకురసం సహజ చక్కెరలను కలిగి ఉంటుంది. ఈ చెరకు రసం శరీరంలో తేమను కాపాడడంలో సహాయపడుతుంది, శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్‌ను అందిస్తుంది. దీనిలో పీచు ఉంటుంది . వేసవిలో అధిక వేడి కారణంగా శరీరం డీహైడ్రేషన్‌కు లోనైప్పుడు.. ఈ చెరకురసం తాగడం వల్ల తక్షణమే శక్తినిస్తుంది. నీరసంతో బాధపడుతున్నవారు చెరకు రసం తాగితే.. చురుగ్గా తయారవుతారని, శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. అలాగే ఇది శరీరంలో నీటి స్థాయిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
చెరకు రసంలో విటమిన్ ఏ, సీ, బీతో పాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఎంతో అవసరమైన పోషకాలు. జీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారు.. చెరకు రసం తాగితే.. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది మరియు ప్రేగుల పనితీరును మెరుగుపరుస్తుంది.
క్యాన్సర్ నివారణ:
చెరకు రసం క్యాన్సర్‌తో పోరాడటంలో సహాయపడుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఆల్కలైన్ స్వభావం కలిగిన చెరకు రసం ప్రోస్టే్ట్, కోలన్, ఊపిరితిత్తుల, రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది. చెరకు రసం శరీర వేడిని తగ్గించడంలో మరియు వేసవికాలంలో చల్లదనాన్ని అందించడంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ రసం కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే మూత్రపిండాల్లో ఉన్న రాళ్ల సమస్యల్ని తొలగించడంలో చెరకు రసం ఎంతగానో దోహదపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
కాలేయ సమస్యలు దూరం:
చెరకు రసంలో ఉండే కాల్షియం మరియు ఇతర పోషకాలు కామెర్లు, ఎముకలను, దంతాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు చెరకు రసంలో అరచెక్క నిమ్మరసాన్ని కలిపి రోజూ తాగడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడి, కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చెరకు రసం పిల్లల్లో తరచూ వచ్చే చిన్నచిన్న అనారోగ్యాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని అంటున్నారు.
బరువుకు చెక్:
బాగా వెయిట్ ఉన్నవారు ఈ చెరుకు రసం తాగడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. దీనిలో కొలెస్ట్రాల్, సోడియం ఉండదు. కావున చెరకు రసం బరువుని నియంత్రించడంలో సహకరిస్తుంది. అంతేకాకుండా ఈ రసంలో గ్లైకోలిక్ యాసిడ్ చర్మానికి చాలా మంచిది. చర్మ తేజస్సును కాపాడడంలో తోడ్పడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో కూడా సహాయపడుతుంది. అయితే.. ఈ రసంతో మంచి ప్రయోజనాలు ఉన్నాయని ఎక్కువగా తీసుకోకూడదు. మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు.