Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించనున్న స్పెషల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2026 పరీక్షకు అంతా సిద్ధమైంది. హాల్ టికెట్లను విడుదల చేసినట్లు టెట్ కన్వీనర్ కృష్ణారెడ్డి ప్రకటించారు. సోమవారం అనగా నేటి నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రత్యేక టెట్ కోసం ఏపీ వ్యాప్తంగా 68,420 మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు.
APలో సర్వీస్ టీచర్ల స్పెషల్ TET-2026 పరీక్ష హాల్ టికెట్లు విడుదలయ్యాయి. సోమవారం నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని TET కన్వీనర్ కృష్ణారెడ్డి స్వయంగా వెల్లడించారు. ముందుగా ప్రకటనించిన షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 11 నుంచి 21 వరకు కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో పరీక్ష జరగనుంది. ప్రతిరోజూ రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. తొలి సెషన్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకటి, రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.
ఈ క్రమంలో ఎగ్జామ్ రాసేవారు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని టెట్ కన్వీనర్ సూచన చేశారు. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్లు cse.ap.gov.in, tet2dsc.apcfss.in నుంచి చేసుకోవచ్చు. పరీక్ష రాసేవారు వారి యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. లాగిన్ వివరాలు మర్చిపోతే నో యువర్ యూజర్ ఐడీ లేకుంటే ఫర్గాట్ పాస్‌వర్డ్ ఆప్షన్ల ద్వారా తిరిగి పొందవచ్చు.
2011కు ముందు ఉపాధ్యాయులుగా నియమితులైనవారు. ఇన్-సర్వీస్ టీచర్ల కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ టెట్‌ను నిర్వహిస్తోంది ప్రభుత్వం. పరీక్షలో పాసైనవారు ప్రస్తుత సర్వీసు కొనసాగింపు లేదా ప్రమోషన్లకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. పరీక్షల తర్వాత అక్టోబర్ 24న ప్రాథమిక కీ విడుదల కానుంది. నవంబర్ 10న తుది కీ విడుదల చేసి ఫలితాలను నవంబర్ 15న ప్రకటించనున్నట్లు టెట్ కన్వీనర్ వెల్లడించారు.