E-Paper
Advertisement

ఏపీలో లక్షన్నర కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్, శంకుస్థాపనకు ప్రధాని

ఏపీలో లక్షన్నర కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్, శంకుస్థాపనకు ప్రధాని
Advertisement

BPCL Refinery: ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను పట్టాలపైకి ఎక్కేందుకు వేగంగా పావులు కదుపుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ ప్రాజెక్టు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌-బీపీసీఎల్‌ ఏర్పాటు చేయనున్న భారీ రిఫైనరీకి పర్యావరణ అనుమతులను మంజూరు చేసింది కేంద్రం. ఈ ప్రాజెక్టును ప్రధాని మోదీ శంకుస్థాపన చేసేందుకు చంద్రబాబు సర్కార్ ప్లాన్ చేస్తోంది.

ఏపీలో లక్షన్నర కోట్ల రూపాయల BPCL రిఫైనరీ ప్రాజెక్టు

ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపలను చేస్తోంది. కేవలం రాజధాని అమరావతి మాత్రమే కాకుండా వివిధ జిల్లాల్లో పెద్ద ప్రాజెక్టులను తీసుకొస్తోంది. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో బీపీసీఎల్ కంపెనీ నిర్మించ తలపెట్టనున్న లక్షన్నర కోట్ల గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ-పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ప్రాజెక్టుకు పర్యావరణ- సీఆర్‌జెడ్ అనుమతులు మంజూరు చేసింది. కేంద్ర పర్యావరణశాఖ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుంది.

దీంతోపాటు పెట్రో కాంప్లెక్స్ నిర్మాణం కూడా

Advertisement

ఫలితంగా ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి-గుడ్లూరు మండలాల పరిధిలో బీపీసీఎల్ ప్లాంటు ఏర్పాటు కానుంది. దాదాపు రూ.1.45 లక్షల కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది.

గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ.. పర్యావరణ కోసం రూ.3,300 ఖర్చు

తొలుత పర్యావరణ ప్రణాళిక అమలు కోసం బీపీసీఎల్‌ రూ.3,300 కోట్లు ఖర్చు చేయనుంది. దీంతోపాటు పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ జరగనుంది. పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైన అభిప్రాయాలు, ప్రాజెక్టు ప్రతిపాదక సంస్థ బీపీసీఎల్‌ సమర్పించిన వివరాలను నిపుణుల కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏపీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ప్రాజెక్టు శంకుస్థాపనకు ప్రధాని మోదీ వచ్చే అవకాశం

Advertisement

అంతేకాదు తీర ప్రాంతంలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్ నాఫ్తా వంటి ఇంధనాలు, రకరకాల పెట్రోకెమికల్ ఉత్పత్తులు తయారు చేయనుంది ఆ కంపెనీ. ప్రాజెక్టులో 30 శాతం గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేయనుంది. కాలుష్య నివారణకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించనుంది.

ALSO READ: విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

ఈ ప్రాజెక్టు ఏర్పాటు కోసం రామాయపట్నం పోర్టు పరిధిలో 6 వేల ఎకరాలు కావాలని ప్రతిపాదించింది బీపీసీఎల్‌. గతేడాది అక్టోబరులో ప్రాజెక్టు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే 4500 ఎకరాలను సేకరించి బీపీసీఎల్‌ పేరిట రిజిస్టర్‌ చేసింది ఏపీఐఐసీ. మరో 6 వేల ఎకరాల్లో టౌన్‌షిప్, లెర్నింగ్‌ సెంటర్, రిఫైనరీ అండ్‌ పెట్రో కెమికల్‌ యూనిట్, అడ్మిన్‌ మెయింటెనెన్స్‌ అండ్‌ ప్రొడక్ట్‌ ట్యాంక్‌లు, క్రూడ్‌ ఆయిల్‌ టెర్మినల్, గ్రీన్‌ హెచ్‌2/రెన్యువబుల్స్‌ యూనిట్లను సంస్థ ఏర్పాటు చేయనుంది.

Related News

స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎత్తుకు పైఎత్తులు.. ఓ వైపు పిటిషన్లు, రిపీట్ అయ్యే ఛాన్స్ అంటూ నేతలకు అలర్ట్

ఆర్టీసీ – బొలెరో ఢీ.. స్పాట్‌లో 24 మందికి పైగానే, నంద్యాల జిల్లాలో ఘటన

ఈసీకి సంచలన లేఖ రాసిన వైసీపీ పార్టీ.. షాక్ లో కూటమి సర్కార్!

అల్లూరి జిల్లాలో ఘోరం.. 5 నెలల పసిబిడ్డను దారుణంగా చంపేసిన కన్నతండ్రి!

జగన్ రాజకీయ భవిష్యత్తు కటకటాలే.. వివేకా హత్య కేసుపై మంత్రి మండిపల్లి ధ్వజం

కడప గడ్డ నుంచి జగన్‌కు సీఎం చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్, రూ. 40 కోట్ల సుపారీకి సమాధానం చెప్పాలి

వైసీపీ ఎంపీ ఉన్నా.. అభివృద్ధిలో వివక్ష లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అనకాపల్లి జిల్లాలో విషాదం.. హిట్ అండ్ రన్ ఘటనలో దంపతులు మృతి!

Big Stories

Advertisement
×