BigTV English

AP Voters List 2023 Draft : ఏపీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. మొత్తం 4.02 కోట్ల మంది ఓటర్లు

AP Voters List 2023 Draft : ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ డ్రాఫ్ట్(ముసాయిదా) ఓటర్ల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. మొత్తం ఓటర్లు: 4,02,21,450 ఉండగా, పురుషులు: 1,98,31,791 మంది, మహిళలు: 2,03,85,851 మంది, ట్రాన్స్ జెండర్లు: 3808 మంది ఉన్నారని ఏపీ ఎన్నికల కమీషనర్ జాబితా విడుదల చేస్తూ పేర్కొన్నారు.

ఈ జాబితా ప్రకారం పురుషుల కంటే మహిళలే అధికంగా ఉండడం గమనార్హం. అలాగే అనంతపురం జిల్లాలో అత్యధికంగా 19,79,775 ఓటర్లు ఉండగా… అల్లూరి సీతారామారాజు జిల్లాలో అత్యల్పంగా 7,40,857 ఓటర్లు ఉన్నట్లు ఆయన చెప్పారు.

ముసాయిదా జాబితాలోని అభ్యంతరాలను డిసెంబరు 9 వరకు స్వీకరించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 2024 జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని పేర్కొంది. ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని జిల్లాల్లోని రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులకు ఈసీ సూచించింది.

2022 జనవరి 6 నుంచి 2023 ఆగస్టు 30వరకు అన్ని స్థాన్నాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టినట్లు ఈసీ వెల్లడించింది. 21,18,940 ఓట్ల తొలగింపు ప్రక్రియను పునః పరిశీలన చేసినట్టు వివరించింది. ఆగస్టులో చేపట్టిన ఇంటింటి సర్వేలో జీరో డోర్ నెంబర్లతో 2,51,767 ఓట్లు గుర్తించినట్టు స్పష్టం చేసింది.

మొత్తం ఓటర్లు- 4,02,21,450
పురుషులు- 1,98,31,791
మహిళలు – 2,03,85,851
ట్రాన్స్ జెండర్లు – 3808
సర్వీస్ ఓటర్లు 66,158
పోలింగ్ కేంద్రాలు – 46,165

Related News

Mega Projects in AP: ఏపీకి భారీ పెట్టుబడి.. అన్ని కోట్లు అనుకోవద్దు.. జాబ్స్ కూడా ఫుల్!

Vinayaka Chavithi 2025: దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన మట్టి గణేష్ విగ్రహం.. దర్శిస్తే కలిగే భాగ్యం ఇదే!

Heavy Rain Andhra: ఏపీకి భారీ వర్షసూచన.. రాబోయే 48 గంటలు కీలకం.. అప్రమత్తం అంటూ హెచ్చరిక!

Auto drivers: బస్సులో బిక్షాటన చేసిన ఆటో డ్రైవర్లు.. రోడ్డున పడ్డామంటూ ఆవేదన

Bhumana Vs Srilakshmi: రూటు మార్చిన వైసీపీ.. టార్గెట్ ఐఏఎస్ శ్రీలక్ష్మి, చీరలు-విగ్గుల ఖర్చెంత?

AP Government Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల స్వరం మారుతోందా?

Big Stories

×