
Rajamouli 13th Movie: బాహుబలి తో టాలీవుడ్ క్రేజ్ ను పెంచి..ఆర్ఆర్ఆర్ తో భారతీయ సినీ ఇండస్ట్రీ సత్తాను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన డైరెక్టర్ రాజమౌళి. హీరో పేరుకే ఒక బ్రాండ్ ఉంటే ఎలా ఉంటుంది అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచిన హీరో మహేష్ బాబు. ఈ ఇద్దరి కాంబోలో రాబోయే చిత్రం కోసం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. మహేష్ మూవీ అంటే ఆ మాత్రం హైప్ ఉండడం కామనే.. దానికి తోడు దీనికి డైరెక్టర్ రాజమౌళి కావడంతో ఇంపాక్ట్ డబుల్ అయింది. అంతే అనుకుంటే ఇప్పుడు ఈ మూవీలో విలన్ గా ఒక స్టార్ హీరో ఎంట్రీ ఈ ఇంపాక్ట్ ను ఏకంగా త్రిబుల్ చేసింది.
రాజమౌళి మూవీ అంటే.. ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. మరి అలాంటి మూవీలో విలన్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో.. మన భల్లాలదేవుడిని చూస్తే అర్థమవుతుంది. హీరో మహేష్ బాబు అంటే ఆపోజిట్ విలన్ ఏ రేంజ్ లో ఉండాలి.. అందుకే ఈసారి ఒక మాస్ హీరో ను రాజమౌళి మహేష్ కి ఆపోజిట్ గా విలన్ గా దించబోతున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదండోయ్ మాస్ మహారాజ్ రవితేజ.
ఇంతకుముందు రాజమౌళి.. రవితేజ కాంబోలో విక్రమార్కుడు మూవీ వచ్చిన విషయం తెలిసిందే కదా. ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రాలేదు. ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ దగ్గర విలన్ గా చేసిన క్రేజ్ రాకుండా పోతుందా. ఆ యాంగిల్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాడో ఏమో రవితేజ ఈ ఆఫర్ కి ఓకే చెప్పినట్టు ఉన్నాడు. ప్రస్తుతం మహేష్ , రాజమౌళి కాంబోలో రాబోతున్న చిత్రం అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ కు ఈ న్యూస్ కాస్త షాకింగ్ గా..మరింత ఎక్సైటింగ్ గా ఉంది.
మరోపక్క మహేష్ గుంటూరు కారం మూవీతో బిజీగా ఉన్నారు. సంక్రాంతి సందర్భంగా మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ తర్వాత మహేష్, రాజమౌళి మూవీ మొదలవుతుంది. ఇప్పటికే ఈ మూవీ కోసం మహేష్ బాబు తన లుక్ ని మార్చుకోవడానికి కసరత్తులు మొదలుపెట్టాడు అని వార్తలు వస్తున్నాయి.మహేష్ ఎదురుగా పవర్ ఫుల్ గా ఉండాలి అని క్రేజీ మాస్ స్టార్ ని రాజమౌళి విలన్ గా మార్చేస్తున్నాడు అనే న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వినడానికి కాంబినేషన్ బాగుంది కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న విషయం అధికారికంగా అనౌన్స్ అయ్యాక తెలుస్తుంది.