Rayalaseema special: రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఫేమస్ రాగి సంగటి, నాటు కోడి పులుసు.. ఏదైన చిన్న అకేషన్ అయిన, లేదంటే ఇంటికి బంధువులు వచ్చిన నాటుకోడి రాగి సంగటి చేయాల్సిందే. మరి రాయలసీమ స్పేషల్ అయినటువంటి నాటుకోడి రాగి సంగటి ఎలా చేయాలో తెలుసా?
నాటుకోడి పులుసు తయారీ విధానం:
కావలసిన పదార్థాలు: చికెన్-అరకిలో
. ఎండుమిరపకాయలు-4
. యాలకులు-4
. దాల్చిన చెక్క-1
. ధనియాలు-(2 టేబుల్ స్పూన్లు)
. మిరియాలు -4
. లవంగాలు-6
. అనాస పువ్వు-2
. వెల్లుల్లి-8
. గసగసాలు-టేబుల్ స్పూన్
. వట్టి కొబ్బరి-1
. నూనె-3 టేబుల్ స్పూన్లు
. పచ్చి మిర్చి-4
. టమోటాలు-2
. కారం- తగినంత
. ఉప్పు-తగినంత
. అల్లం వెల్లుల్లి పెస్ట్- 2టేబుల్ స్పూన్లు
. పసుపు-చిటెకెడు
. ఉల్లిపాయ-2
. కరివేపాకు- నాలుగు రెబ్బలు
. కొత్తిమిరా- తగినంత
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులో సరిపడా నూనె పోసుకుని అది కొంచెం మరిగాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని అవి కాస్తా వేగాకా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ రెండు కాస్తా వేగాకా కొద్దిగా పసుపు, కరివేపాకు వేసుకోవాలి. దీని తర్వాత కొద్దిగా ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ఫేస్ట్ వేసుకోవాలి. ఈ మసలా అంత వేగాకా ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి దీంతో పాటుగా ఉప్పు వేసి బాగా కలిపి పది నిమిషాలు బాగా వేగనివ్వాలి. అయితే ఎండుమిరపకాయలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, మిరియాలు, లవంగాలు, అనాస పువ్వు, వెల్లుల్లి, గసగసాలు, వట్టి కొబ్బరి వీటిని మొత్తం కలిపి మిక్సి పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాల పొడిని ఉడుకుతున్న చికెన్‌లో వేసి బాగా కలుపుకోవాలి. దీని తర్వాత చికెన్‌కు సరిపడా కారం వేసుకుని, అలాగే ఉడకడానికి సరిపడా నీళ్లు మూసి మూత పెట్టాలి. ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుని కాస్తా ఉడకనివ్వాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసుకుని వీటిని కలిపి దించేసుకుంటే అంతే.. గుమగుమలాడే నాటుకోడి పులుసు రెడీ.
Also Read: ఆరోగ్యానికి 12 సూత్రాలు.. అవేంటో తెలుసా?
రాగి సంగటి తయారీ విధానం:
కావల్సిన పదార్థాలు:
బియ్యం- రెండు కప్పులు
రాగిపిండి- ఒక కప్పు
నీరు- తగినంత
తయారీ విధానం:
ముందుగా బియ్యంను శుభ్రం చేసుకుని ఐదు నిమిషాల నానబెట్టుకోవాలి.. తర్వాత ఆ బియ్యానికి సరిపడా నీళ్లు పోసి చిన్న మంట మీద బాగా ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికిన అన్నంలోకి తగినంత రాగి పిండి వేసి సిమ్‌లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. దీని తర్వాత రాగి ముద్దలు కట్టుకుంటే అంతే ఇంకా రాయలసీమ స్పేషల్ రాగి సంగటి రెడీ అయినట్టే.